టాలీవుడ్‌లో స్టార్ ఫిల్మ్ డైరక్టర్ హరీష్‌శంకర్‌కి సెపరేట్ గుర్తింపు ఉంది. సినిమాలను డైరెక్ట్ చేయటంతో పాటు ఆయన తన రూట్‌ను మార్చారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5తో కలిశారు హరీష్ శంకర్. ఆయనకు సపోర్ట్‌గా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు కూడా జాయిన్ అయ్యారు. వీరిద్దరూ కలిసి `ఏటీఎం` అనే వెబ్ సీరీస్‌ని రూపొందించారు.
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, కృష్ణ, రవిరాజ్, రాయల్ శ్రీ, దివి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సి.చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. జనవరి 20న రాబోతోన్న ఈ `ఏటీఎం` ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘కరోనా కంటే ముందు ఈ కథను రాసుకున్నాను. కరోనాలో ఇంకా డెవలప్ చేశాను. ఓటీటీలకు రాస్తే క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది. మంచి కంటెంట్‌ను జనాల ముందుకు తీసుకు రావడానికి ఫైనాన్షియల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని తరువాత నాకు అనిపించింది. ఏటీఎం సినిమాకు ప్రశంసలు వస్తే.. అవన్నీ దర్శకుడు చంద్ర మోహన్‌కు మాత్రమే దక్కాలి. సినిమాను అద్భుతంగా తీశారు.
బడ్జెట్ విషయంలో సహకరించిన జీ5 టీంకు థాంక్స్. హర్షిత్, హన్షితకు వెల్కమ్. ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎన్నో తీయాలి. ఎస్వీసీలో డైరెక్షన్ చేయడం అనేది పెద్ద అచ్చీవ్‌వెంట్. చంద్ర మోహన్‌కు ఆ అవకాశం దక్కింది. రెమ్యూనరేషన్ విషయంలో సుబ్బరాజు సహకరించారు. నా ఫస్ట్ సినిమా షాక్‌లో సుబ్బరాజు చేశారు. ఇప్పుడు నా ఫస్ట్ ఓటీటీ సినిమాలోనూ సుబ్బరాజు నటించారు. షఫీ గారు ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. దివి, అశ్విన చక్కగా నటించారు. ప్రశాంత్ ఆర్ విహారి గారు మంచి సంగీతాన్ని, ఆర్ఆర్‌ను ఇచ్చారు.
జీ5 టీం మాకు ఎంతో సహకరించారు. మా కోసం ఎన్నో రూల్స్ బ్రేక్ చేశారు. వారి వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత క్వాలిటీగా వచ్చింది. రెండో సీజన్ కూడా రాబోతోంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది. ఏటీఎంలో సన్నీ, రోయల్, రవి రాజ్, కృష్ణ నలుగురు పాత్రలు కాదు.. నాలుగు పిల్లర్స్. సన్నీకి పర్పెక్ట్ మాస్ హీరో అయ్యే అవకాశం ఉంది. అందరూ అద్భుతంగా నటించారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. జనవరి 20న జీ5లో రాబోతోంద’ అని అన్నారు.