Crime News: ప్రస్తుత కాలంలో స్నేహం ముసుగులో ఎంతోమంది యువత మోసపోతున్నారు. అపరిచితులతో స్నేహాలు వద్దు అని పోలీస్ బృందం హెచ్చరిస్తున్న అపరిచితులతో స్నేహం చేయడం ద్వారా తమ చావుని తామే కోరి తెచ్చుకుంటున్నారు నేటి యువత అటువంటి సంఘటన హిందూపురంలోని ఒక విషాద ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన దేంతనపల్లి అక్షిత కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని ఓ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతోంది. అయితే మెదక్ జిల్లా పటాన్ చెరువుకు చెందిన మహేష్ వర్మ గత ఆరు క్రితం బస్సులో ప్రయాణంలో పరిచయమయ్యాడు.అలా అక్షిత ఇన్‌స్ట్రాగామ్ ఫాలో అయ్యి ఫొటోలు డౌన్‌లోడ్ . చేసుకొని వాటిని అశ్లీలంగా మార్చిన అనంతరం అక్షితకు చూపి బెదిరిస్తూ వచ్చాడు.
ఈ క్రమంలోనే బుధవారం ఆమెను హిందూపురంలోని జీఆర్ లాడ్జికి వచ్చేలా చేయడం జరిగింది. లాడ్జిలోని ఓ రూంలో అక్షిత గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని తన కుటుంబానికి తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు . అక్షిత సోదరుడు తన సోదరిని ఫోటోలు మార్ఫింగ్ తో లాడ్జి వరకు రప్పించాడని మహేష్ వర్మ పై కేసు నమోదు చేయడం జరిగింది. ఇంస్టాగ్రామ్ లో ఫొటోస్ పెట్టేవారు కొంచెం ఆచితూచి సోషల్ మీడియా తన ఫొటోస్ షేర్ చేసుకోవాల్సిందిగా పోలీసులు తెలుపుతున్నారు. అలానే అపరిచితులతో స్నేహం తగుదు అని ఒకవేళ అపరిచితులతో స్నేహం చేస్తే ఇటువంటి దుస్థితి ఏర్పడుతుందని సూచించడం జరుగుతుంది.