Health చలికాలంలో ఒక్కొక్కరిని ఒక్కో సమస్య వేధిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ కాలంలో ఎన్నో రకాల చర్మ సంబంధిత సమస్యలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయితే వీటిని దూరం చేసుకోవాలి.. అలాగే ఈ కాలంలో శరీరాన్ని అనారోగ్యాలు బారిన పడకుండా కాపాడుకోవాలి అంటే కొన్ని రకాల పనులు కచ్చితంగా చేయాలి.. అంటే ఏం చేయాలో చూద్దాం..
చలికాలంలో సాధారణంగా ఉదయం సమయంలో నిద్ర లేవటానికి ఎవరు ఇష్టపడరు కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టి ఉదయాన్నే నిద్ర లేచి కాసేపు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి అలాగే శరీరానికి కాస్త ఎండ తగిలే విధంగా ఉండటం మంచిది. అలానే ఎక్కువ సేపు ఎండలో ఉండకూడదు దీని వలన చర్మానికి హాని కలిగే అవకాశం కూడా ఉంటుంది..
అలాగే గోరు వెచ్చని నీటితో రోజుకు రెండుసార్లు స్నానం చేయడం మంచిది.. శీతాకాలంలో చాలామంది సన్ స్క్రీన్ లోషన్ వాడరు.. అయితే సన్ స్క్రీన్ లోషన్ తో పాటు మాయిశ్చరైజర్ కూడా వాడటం మంచిది.. అలాగే వేయడం లేదని నీరు తీసుకోకుండా ఉండకూడదు దీని వలన బాడీ డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది గోరువెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.. అలాగే మధ్యాహ్నం సమయంలో కొబ్బరి నీళ్లు చెరుకు రసం తాగడం వల్ల కొంతవరకు ఉపశమనం ఉంటుంది.. అలాగే వీలైతే శరీరానికి అన్ని రకాల పోషకాలు అందించడం చేయాలి.. ముఖ్యంగా శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందించడమే కాకుండా తగినంత వ్యాయామం కూడా అవసరం