Bhakthi హిందూ సాంప్రదాయం ప్రకారం గుడికి వెళ్ళిన భక్తులు గుడి ముందు భాగాన్ని, దేవున్నే కాకుండా గుడి వెనక భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ప్రదక్షిణాలు చేసే సమయంలో కూడా గుడి వెనక ఉండే దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటారు. అయితే ప్రతి గుడిలోని ఇదేవిధంగా గుడి వెనుక దేవుణ్ణి ఉంచటం ఒక ఆచారం. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు.. ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులు ఈ పద్ధతిని ఆచరిస్తారు.
అయితే ఇలా చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.. ఆచారం ప్రకారం ఇలా చేయరు దీని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటంటే.. గుడిలో అన్నిటికన్నా మూల విరాట్ ఉండే గర్భాలయం ఎంతో పవిత్రమైంది. గర్భాలయంలో మూల విరాట్టుని గోడల మధ్యగా కాకుండా.. వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్టిస్తారు. పూజలు, నిత్య మంత్రార్చన చేయటం చేసినప్పుడు భగవంతుడు లోని శక్తి గర్భగుడిలోని నాలుగు మూలలకు వ్యాపిస్తుంది. ఇలాంటి సమయంలో అన్ని వైపుల కన్నా వెనక గోడకు మూలవిరాట్ దగ్గరగా ఉంచడం వల్ల అటువైపు శక్తి ఎక్కువగా ప్రసారం అవుతుంది. అందుకే గుడి వెనుక భాగంలో దైవ విగ్రహాన్ని చెక్కి ఉంచుతారు. ఆ ప్రాంతాన్ని భక్తులు దర్శించుకుని దండం పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఏ గుడికి వెళ్ళినా ఈ నియమం అనేది వర్తిస్తుంది.
హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్క దానికి వెనుక ఎంతో అర్థం పరమార్థం ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు, కృష్ణ తత్వం తనను ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుతానని చెప్తూ ఉంటారు. ఇదే విధానం మన సాంప్రదాయాలు కూడా వర్తిస్తుంది. అన్నిటి వెనుక మనకి అర్థం కాని మనకు తెలియని ఎన్నో గొప్ప గొప్ప విషయాలు దాగి ఉన్నాయి.