Health : ఋతుస్రావ సమయం లో ముఖ్యంగా మహిళలలో ఋతుస్రావ సమయంలో ఎటువంటి పోషకాహారం తీసుకోవాలి . అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది.
ఋతుస్రావ సమయంలో చాలామంది స్త్రీలలో అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా కొందరు కడుపులో మెలితిప్పుతున్నట్లు వికారంగా ఉంటుంది. మరికొందరిలో బాడీపెయిన్స్ ఎక్కువగా ఉంటుంది. దీనికి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఈ నొప్పి తగ్గుతుంది. తరచూ పెయిన్ కిల్లర్స్ ను వేసుకోవడం కూడా మంచిది కాదు అందువల్ల ఇలాంటి నొప్పిని ఆహారం ద్వారా నయం చేయవచ్చు అని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు.
నిమ్మ అల్లం టీ ఋతుస్రావ సమయంలో నొప్పికి నిమ్మ అల్లం టీ మంచి మందు. అల్లం కడుపులో ఉండే మంటను గ్యాస్ ను తగ్గిస్తుంది. నిమ్మరసం వాంతులు రాకుండా అడ్డుకుంటుంది.
పాలకూర ఋతుస్రావం ఎక్కువగా అయినప్పుడు శరీరంలో ఐరన్ నిల్వలు బాగా తగ్గిపోతాయి. దీనివల్ల నీరసంగా, తల తిరుగుతున్నట్లు ఉంటుంది. ఇలాంటి సమయాల్లో పాలకూరను ఎక్కువగా తినడం వల్ల మన శరీరానికి మెగ్నీషియం, క్యాల్షియం వల్ల ఐరన్ శాతం పెరగడమే కాకుండా కడుపులో ఉండే కండరాలు కూడా బాగా రిలాక్స్ అవుతాయి.
అరటి పళ్ళు అరటిపళ్ళల్లో బోరాన్ అనే ఒక లవణం ఉంటుంది. ఇది క్యాల్షియం ఫాస్పరస్ లు ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది. అందువలన ఋతుస్రావం సమయంలో వచ్చే నొప్పి మందగిస్తుంది.
కిస్మిస్లు కిస్మిస్లను కుంకుమ పువ్వుతో కలిపి నానబెట్టి.. ఆ రసాన్ని తాగితే నొప్పి తగ్గుతుంది. నొప్పితో పాటుగా మూడు స్వింగ్స్ కూడా తగ్గుతాయి. ఋతుస్రావ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఉదయము ఈ రసాన్ని తాగితే చాలా సమస్యలు తగ్గిపోతాయి.