టారోట్ కార్డు రీడింగ్ ఇప్పుడిప్పుడే మన దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందుతున్న జ్యోతిష్య పద్ధతి. దీనిగురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక భవిష్యవాణి. దివ్య దృష్టితో భూత, భవిష్య, వర్తమాన కాలాలను చెప్పగలిగే అద్భుత సాధనం. 15వ శతాబ్దం మధ్యలో యూరప్ లో మొదలైన ఈ టారోట్ కల్చర్ నెమ్మనెమ్మదిగా కాలానుగుణంగా ఎన్నో రూపాంతరాలు చెందుతూ వచ్చింది. అలవాట్లకు, సంప్రదాయాలకు, పద్ధతులకు తగినట్లుగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా టారోట్ కార్డ్స్ రూపొందాయి. మన భూత, భవిష్య, వర్తమాన కాలాల సమాచారమంతా విశ్వంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ నిక్షిప్తమైన సమాచారమంతా విశ్వంలోని పంచభూతాలు అనగా గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశంల ఆధీనంలో ఉంటుంది.
టారోట్ కార్డు డెక్ ని రెండు ప్రధాన భాగాలుగా విభజిస్తారు. అవి ఒకటి మేజర్ ఆర్కానా, రెండు మైనర్ ఆర్కానా. మైనర్ ఆర్కానా మళ్ళీ నాలుగు విభాగాలను కలిగి ఉంటుంది. మేజర్ ఆర్కానా పంచభూతాలలోని ఆకాశాన్ని రిప్రసెంట్ చేస్తుంటే మైనర్ ఆర్కానాలోని పెంటకిల్స్, వాంట్స్, స్వాట్స్ ,కబ్స్, భూమి, అగ్ని, గాలి, నీరుని రిప్రసెంట్ చేస్తాయి. టారోట్ రీడర్ ఆ కార్డ్స్ని ఆక్టివేట్ చేసినప్పుడు టారోట్ కార్డ్స్ పంచభూతాలతో అనుసంధానమై విశ్వంలోని సమాచారాన్ని కార్డ్స్ ద్వారా టారోట్ రీడర్ కి తెలియ చేస్తాయి. అయితే ఇందులో టారోట్ రీడర్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఏకాగ్రత, మెడిటేషన్, సాత్విక స్వభావం, దివ్యదృష్టి అనే ప్రత్యేక లక్షణాలు ఉన్న కొంతమంది మాత్రమే టారోట్ కార్డ్స్ కి అనుసంధానం అవుతారు. అలాంటివారు ఎదుటివ్యక్తి మనస్తత్వాన్ని, అతని భవిష్యత్ ని అతని జీవితంలో జరిగిన సంఘటనలని, అతని ఆలోచన పద్దతులను కూడా విడమరచి చెప్పగలరు. క్లుప్తంగా చెప్పాలంటే భవిష్యత్ లో జరుగబోయే ముఖ్యమైన సంఘటనలనే కాకుండా ఎదుట వ్యక్తి మనస్సులోని ఆలోచనలని కూడా చెప్పగలిగే పద్ధతి ఈ టారోట్ రీడింగ్ కు ఉన్న ప్రత్యేకత. అయితే ఇది పూర్తిగా టారోట్ రీడర్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది.
తమ వద్దకు సమస్యలతో వచ్చేవారికి సలహాలు, సూచనలు, పరిహారాలను సూచించడమే కాకుండా సమస్యలను ఎదుర్కొనే మనో ధైర్యాన్ని, ఆలోచనా శక్తిని కూడా టారోట్ రీడర్స్ కన్సల్టేషన్ లో భాగంగా క్లయింట్స్ కి సూచిస్తారు అందుకే ఎంతో మంది టారోట్ రీడర్స్ కి తొందరగా కనెక్ట్ అవుతూ తమ సొంతవారిలా ఫీల్ అవుతుంటారు.ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ టారోట్ రీడింగ్ ఇంత ప్రజాదరణ పొందింది. – Devi Professional Tarot Card Reader, Ph. 095384 34804, 096422 98899.