చిత్రకళ: Painting: Sudhakanth : కళ అనేది ఒక గొప్ప అనుభూతిని పంచే మాధ్యమం, అందులో నైపుణ్యం సంపాదించడం ఒక సాధన ద్వారా, తపస్సు ద్వారానే సాధ్యం, కొంతమందికి ఆ కళ పుట్టుక ద్వారానే అబ్బుతుంది, కొందరికి ఇష్టం ద్వారా తపన సాధన ద్వారానే అబ్బుతుంది, అలాంటి కళ ను పుట్టకతోనే స్వంతం చేసుకున్న సహజ చిత్రకారుడు సుధాకాంత్ గారు, కానీ అంతటితో ఆగక చిత్రకళలో మాస్టర్ డిగ్రీ చేసి మనసుకు, తన చేతిలోని కళకు సాధన ద్వారా సానబెట్టి, గొప్ప నైపుణ్యాన్ని స్వంతం చేసుకున్నారు… జననం:- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అనంతపురం జిల్లా లో ఉరవకొండ మండలం లోని కొట్టాలపల్లే గ్రామం లో జన్మించారు,
సైకత చిత్రకళ : Sandart – Sand Art చెయ్యడం ఎలా ? Sandartist Sudhakanth : సుధాకాంత్ గారు BFA మరియు MFA లో పట్టాభద్రులు,BFA చేస్తుండగా రోజుకు 100 స్కెచ్ లు చెయ్యడం తనకు తాను నిర్ణయించుకున్న గురి. ఒకసారి వారి ప్రిన్సిపల్ RM Hadapad గారు చెప్పిన మాట అందుకు కారణం. స్కెచింగ్ అనేది చిత్రకళకు మూలం, అదే చిత్రకళ లో రాణించడానికి, నిలబడడానికి మూలం. అలా సుధాకాంత్ ఎంతో ఏకాగ్రతతో ఒక తపస్సు లాగా స్కెచింగ్ చేసేవారు, అలా చెయ్యడం ద్వారా తనకు అమితమైన ఆత్మ సంతృప్తి, ఆత్మ స్థైర్యం రెండూ దక్కాయని, దాని మూలంగా తనలో ఉన్న సృజనాత్మకత ను సరళంగా కాన్వాస్ మీద పెట్టగలిగే ధైర్యం అలవడింది అని చెబుతారు.
తను స్వతహాగా ప్రయోగాత్మక సృజన శీలుడు కావడం వలన ఇంకా ఏదో సాధించాలి, క్రొత్తది కనుగొనాలి అన్న ఆలోచన అతని మనస్సును తోలిచేది. ఆ తృష్ణ తో, అన్వేషణలో కనుగొనబడిన, ప్రారంభించినబడిన సమకాలీన చలన చిత్రాత్మక విధానం లో ప్రత్యక్ష చిత్రకళ ప్రదర్శనను ఇవ్వడానికి సైకత చిత్రకళ Sandart ను మొదలు పెట్టారు. ఇది 21 వ శతాబ్దపు విప్లవాత్మక అద్భుతమైన చిత్రకళ గా వర్ణిస్తారు సుధాకాంత్. కళాత్మక మాస్ కమ్యూనికేషన్ మీడియాగా దీనికి సాటి లేదు అని చెబుతారు.Sandart సమకాలీన (Contemporary): చిత్రకళ రంగంలో ఒక విప్లవాత్మక మాధ్యమంగా ప్రపంచ ఖ్యాతి గడించింది. సైకత చిత్రకళ కు మూలంగా కావలసినది స్కేచింగ్ లో మంచి పట్టు, అది ఎలానూ ఆయన చేతిలో కరతలామలకం. అలాగే memory power, జ్ఞాపక శక్తి, కథను తయారు చేసుకునే సృజనాత్మకత, కథను చేపెప్ విధానం, స్క్రీన్ ప్లే, వీటితో పాటు, సాంకేతిక జ్ఞానం, కెమెరా, అందులో వున్న రకాలు సాంకేతికత మీద పూర్తి అవగాహన ఉండడం చాలా ముఖ్యం. అలాగే ఇసుక అనేది ఇక్కడ ఒక ముఖ్య మైన సాధనం. ఇసుక ను తొలగించడం ద్వారా వెలుగు నీడల సయ్యాటతో బొమ్మలను చిత్రించడం దానిని ప్రత్యక్షంగా తిలకించడం, అలా తిలకించిన వారికి కలిగే అనుభూతి ఒక అద్భుత మధురానుభూతిని ప్రేక్షకులకు మిగల్చడం, ఈ కళ ప్రత్యేకత.
ఈ కళ ను ప్రదర్శించే సమయంలో కళాకారునికి వుండవలసిన ముఖ్యమైనది మానసిక స్థైర్యం, ఆత్మ విశ్వాసం, చేస్తున్న దానిమీద ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, బొమ్మలు గీయడంలో పట్టు, వేగం, సంగీతాన్ని సమ్మిళితం చేసుకోవడం, వెనుకగా జరిగే కథా ప్రసంగం, గీసే బొమ్మల ద్వారా భావావేశాలను వ్యక్తీకరించడం. ఇంత మానసిక స్థితిని నిలుపుకొగలగడం అనేది తీవ్రమయిన కృషీ, పట్టుదల, తపన ద్వారా మాత్రమే సాధ్యం. ఇలా ప్రదర్శన ఇస్తూ అందులో లీనమైపోయిన కళాకారుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు వుండవు, అలా ఆత్మానందం పొందుతూ, అదే ఆనందాన్ని వీక్షకులకు పంచడం కళాకారుడిగా తనకు గొప్పవరం అంటారు సుధాకాంత్.
Sand Art చెయ్యడం ఎలా ? : ముఖ్యంగా స్కెచ్చింగ్ లో మెళుకువలు తెలిసి ఉండాలి, చిత్రకళలో పట్టు వుండాలి. బొమ్మలు వేగంగానూ అర్థవంతంగా గీయడం తెలిసుండాలి, భావావేశాలు పలకించగల సృజనాత్మకత ఉండాలి, ఊహించిన కథను హృద్యంగా చూపించగలగాలి, ఇందులో ముఖ్యంగా ఒక (స్కెచ్ ) బొమ్మ నుండి మరొక బొమ్మకు రూపాంతరం చెందుతూ మార్పుచెందడాన్ని కళాకారుడి సృజనాత్మక శక్తికి నిదర్శనం.
పరికరాలు Tools: Acrylic Sheet: 3x4feet లేదా 16:9 లేదా Rectangular Acrylic Sheet తీసుకోవాలి. దాన్ని వుంచడానికి Sheet అడుగు భాగాన నాలుగు వైపులా 1అడుగు ఎత్తు Thermocol డబ్బా, మధ్యలో క్రింద ఒక బల్పు, అది tube లైట్ కూడా కావచ్చు, మామూలు బల్బు కావచ్చు, glass పైన వేసిన ఇసుక బయటికి జారిపోకుండా నాలుగు వైపులా అడ్డుగా 3 inches Hight Thermocol లేదా మరేదైనా card board ను వుంచుకోవాలి. బల్బు వెలిగించిన తరువాత దానిమీద ఇసుక వెయ్యాలి.
ఇసుక: సాధారణంగా ఇసుక ఎక్కువ రాయితో కూడి ఉంటుంది, కనుక, బాగా సన్నగా అయ్యేలా జల్లెడ పట్టాలి, అలాంటి ఇసుకను glass మీద వేసి కావలసిన బొమ్మ గీసుకోవాలి, అలా గీయగా క్రిందనుండి వెలుగు కనిపిస్తూ గీతలను స్పష్టంగా కనిపించేలా చేస్తుంది, ఇది చేయునపుడు కాస్త చీకటి గదిని ఎంచుకోవడం మేలు, స్పష్టత ఎక్కువగా వుంటుంది. అలా తోచిన బొమ్మలను గీస్తూ సాధన చెయ్యాల్సి వుంటుంది, అలాగే నిష్ణాతులైన వారివద్ద మెళుకువలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే YouTube లోని కళాకారుల వీడియోలు చూడడం ద్వారా స్వీయ గ్రాహణ ద్వారా ఎన్నో మెళుకువలు నేర్చుకోవచ్చు. కానీ వీటన్నిటికీ ముందుగా sketching లో మంచి పట్టు వుండడం చాలా ముఖ్యం.
కెమెరా: కెమేరా యొక్క అవసరం ఎప్పుడు పడుతుంది?: కెమెరా యొక్క అవసరం Acrylic Sheet మీద మనం చేసే కళను అందరికీ చూపించాలంటే ఇది ముఖ్యమైన సాధనం, దీనిని ప్రొజెక్టర్ కు అనుసంధానించి దాని ద్వారా స్క్రీన్ మీద ప్రదర్శనను తిలకించడానికి అనువుగా ఏర్పాటు చేస్తారు, కెమెరాను పైననుండి ఇసుక వేసిన acrylic glaas కు అభి ముఖంగా అమర్చుకోవాలి, అపుడు కెమెరా చూస్తున్న బొమ్మలు స్క్రీన్ మీద కనిపిస్తాయి, సాధారణంగా కెమెరాలో రెండు aspect ratio lu వుంటాయి, ఒకటి 4:3, రెండోది 16:9. వుండాల్సి వుంటుంది, ఇందులో స్క్రీన్ కు అనుకూలమైన పద్దతిలో కెమెరా లోపల సెట్టింగ్స్ అమర్చుకోవాలి. ప్రొజెక్టర్ కు అనుసంధానించిన కెమెరా ద్వారా స్క్రీన్ మీద బొమ్మలు కనిపిస్తాయి. ఆ విధంగా Sandart ను చాలా మంది ఒకేసారి వీక్షించడానికి సాధ్య పడుతుంది.
Back Ground Music : Sandart ప్రదర్శన జరిగే సమయంలో నేపథ్య సంగీతం వుంచుకుంటే మరింత భావుకత్వం పండుతుంది. చలనచిత్ర అనుభూతి పొందవచ్చు. అలాగే ప్రదర్శనలో ఎంచుకున్న కథను నేపథ్య గాత్రం (Background Narration) వుండడం ద్వారా వీక్షకులకి కథ బాగా అర్థమవుతుంది, తద్వారా కథలో వున్న భావం బొమ్మల ద్వారా వ్యక్తమవుతూ ఉంటే ఆ ప్రక్రియను వీక్షకులు తమ మనసులో ఊహించుకునే భావం ఇంకా అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఇలా Sandart ఒక వినూత్న విధాన కథా చలన చిత్రలేఖన ప్రదర్శనగా ప్రాముఖ్యత సంపాదించుకుంది. Sandart ను ఈవెంట్స్ లో ఎక్కువగా ప్రోత్సహిస్తారు, ఇలా పెద్ద ఈవెంట్స్ కు సంబంధించిన ఈవెంట్ మేనేజర్ ల పరిచయాలు ఇక్కడ చాలా ముఖ్యం.
ఇప్పటివరకూ Sudhakanth గారు భారత దేశం మొత్తం మీద 2009 నుండి 2019 వరకూ 500 కు పైచిలుకు ప్రదర్శనలు ఇచ్చిఉన్నారు.
ఇందులో ప్రముఖంగా చెప్పుకో దగినవి: Asian Institute of Gastroenterology Hospital Hyderabad, Deloit, P&G, Cognizant, HIL, Mahindra, Toyota, Komake IT, Novotel Hyd, Clear Harbor, Yashoda Hospital, KLM Fashion, Kalamandir, in Hyderabad, Suntech, etc in Kerala, Satyam and etc Chennai, Value Labs etc Bangalore, Delhi, Bombay etc
చిత్రసీమ పరంగా రాంగోపాల్ వర్మ గారి చిత్రానికి టీసర్ చేయడం విశేషం, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి 150 వ చిత్రమైన ఖైదీ నం 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ప్రదర్శన ఇచ్చారు, అలాగే ఇంకా కొన్ని చలన చిత్ర ఈవెంట్స్ లో ప్రదర్శనలిచ్చారు, జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవిత కథా చలన చిత్రమయిన “యాత్ర” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెయ్యడం మరీ విశేషం. PJR గారి కుమారుడి అభ్యర్థన మేరకు PJR ఉన్నతిని కీర్తించిన 3 పాటలకు Sanadart ద్వారా చూపించడం జరిగింది. ప్రముఖ దర్శకులు Dr కే విశ్వనాథ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ తీసుకున్న సందర్భంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సన్మాన సభలో, విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వడం, విశ్వనాథ్ గారి చేతుల మీదుగా CB Naidu గారి చేతుల మీదుగా సత్కారం పొందడం ఒక గొప్ప మరపురాని జ్ఞాపకం, అలాగే ఈ మధ్యనే ఈటీవీ 25సంవత్సరాల ఈవెంట్ సందర్భంగా రామోజీ రావు గారు ఆయన జీవితంలో సాధించిన విశేషాలతో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చి అందరి మన్ననలు పొందారు. అలాగే టీటీడీ కి సంబంధిన ఎస్వీబీసీ ఛానెల్ వారు కోరగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద ఒక గొప్ప Sandart వీడియోను తయారు చేసి ఇచ్చి ఆ స్వామి వారి కృపకు పాత్రులయ్యారు, తన పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతా ఇనుమడింప చేసుకున్నారు, ఇవేకాక చాలామంది వివాహ మహోత్సవాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చారు,
ఇంకా కొంతమంది ఔత్సాహికులు తమ తల్లితండ్రి జీవిత కథలను, స్వీయ జీవిత కథలను, భార్యా భర్తల మధ్య వున్న కొన్ని విశేష దినాలకు, ప్రేమికులకు అనుకూలంగా వీడియోలను చేయించుకునేవారు చాలామంది ఆయనను కలుస్తూ వుంటారు. భారతదేశం లో ఇపుడున్న Sandartist లలో ప్రముఖులుగా నిలదొక్కుకున్నారు అంటే కారణం కృషీ, పట్టుదల, పరిచయాలు.స్వతహాగా ఉపాధ్యాయ వృత్తిని తన తల్లి తండ్రి దగ్గరనుండి గమనించడం ద్వారా ఆయనకు బోధన విధానం బాగా అలవడింది. కొంత మంది ఔత్సాహికులు తమకూ sandart నేర్పించమని, మెళుకువలు తెలుపమని కలిసి అడుగుతూ వుంటారు. ఆ కారణంగా ఆయన శిక్షణ ఇవ్వడానికి సుముఖంగానే వున్న, శిక్షణ తీసుకునే వారి శ్రద్ధ మీద ఆధారపడి వుంటుంది. కాబట్టి ఈ కళను తపనతో ఇష్ట పూర్వకంగా నేర్చుకో దగినవారు సుధాకాంత్ గారిని సంప్రదించగలరు.