యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’తో దీపావళి రేసులో ఉన్నారని ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 31న విడుదల కానుంది. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు.
ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మెకానిక్ రాకీ ఎక్సయిటింగ్ రైడ్‌కు శ్రద్ధా శ్రీనాథ్ ని స్వాగతిస్తూ, మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. స్లిట్ మ్యాక్సీ డ్రెస్‌లో శ్రద్ధా శ్రీనాథ్ అల్ట్రా మోడిష్‌గా కనిపిస్తోంది. చర్మిస్మాటిక్ స్మైల్ తో కనిపించిన ఫస్ట్ లుక్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది.
హైబడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.
Cast : Vishwak Sen, Meenakshi Chaudhary, Shraddha Srinath, Naresh, Viva Harsha, Harshavardhan, Roadies Raghu Ram
Technical Crew :
Writer, Director: Ravi Teja Mullapudi
Producer: Ram Talluri
Production Banner: SRT Entertainments
Music: Jakes Bejoy
DOP: Manojh katasani
Production Designer: Kranthi Priyam
Editor: Anwar Ali
Executive producers: Satyam Rajesh, Vidya Sagar J