Weekly Horoscope From May23rd to May 29th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscopes, Horoscope in Telugu.
ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మే 23 నుండి మే 29వరకు వారఫలాలు.
మేష రాశి :
వీరు ఆరోగ్య సమస్య ల నుండి బయట పడతారు. వీరు వాహనాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతానం యొక్కవిషయంలో ఖర్చులు అధికం అవుతాయి. వ్యాపారస్తులకు సామాన్య లాభాలు. వృత్తి జీవితం లో ఉన్నత ఫలితాలు కలుగుతాయి. అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం లక్ష్మీనరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
వృషభ రాశి :
వీరికి ఈవారం రోజుల్లో దూర ప్రయాణాలు సూచించపడుతోంది. సంతానాని కి ఉద్యోగ ప్రాప్తి. పని చేసే చోట గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఈ రాశి వారు ఆర్థిక వృద్ధి కోసం కనకధారా స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
మిథున రాశి :
విద్యార్ధులకి అధిక శ్రమ సూచిస్తోంది. స్థిర ఆస్తులు విషయంలో సమస్యలు ఎదురు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో, వృత్తి లో అధిక శ్రమ సూచిస్తోంది. వీరి సంతానానికి ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం గణపతి ద్వాదశ నామాలు చదవటం శ్రేయస్కరం.
కర్కాటక రాశి :
ఆరోగ్య పరంగా సామాన్య ఫలితాలు. ఆదాయం పరంగా అసంతృప్తికి లోను అవుతారు. గృహనికి సంబందించిన పనులలో ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసo కనకధారా స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
సింహ రాశి :
సంఘంలో గుర్తింపు, ఆరోగ్య పరంగా ఉత్తమ ఫలితాలు. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఉద్యోగాలలో స్థాన చలనం. వ్యాపారంలో స్వల్ప లాభాలు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం మరియు ఆర్థిక వృద్ధి కోసం ధనలక్ష్మి స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
కన్య రాశి :
వీరి సంతానానికి ఉత్తమ ఫలితాలు. వృత్తి, వ్యాపారాలలో గుర్తింపు. నూతన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం వెంకటేశ్వర స్వామిని అర్చించటం ఉత్తమం.
తులా రాశి :
కళాకారులకి, క్రీడాకారులకు ఉత్తమ ఫలితాలు. వృత్తిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. విద్యార్ధులకి ఉద్యోగ అవకాశాలు కలసి వస్తాయి. వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం దుర్గ స్తుతి చెయ్యటం ఉత్తమం.
వృశ్చిక రాశి :
వీరికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురుకోనే అవకాశం కలదు. ఉద్యోగులకి స్థాన మార్పిడి కనిపిస్తోంది. విందు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారస్థులకి కొంత తక్కువ లాభాలు కలుగుతాయి. వీరు ఉత్తమ ఫలితాలు కోసం సుబ్రమణ్య అష్టకం చదవటం శ్రేయస్కరం.
ధనస్సు రాశి :
వృత్తిలో ఆర్థిక వృద్ధి. పోటీ పరీక్షలో విజయం, గుర్తింపు. అనుకున్న కార్యాలలో మార్పుల వల్ల కొంత ఆలస్యంగా పనులు పూర్తి అవ్వటం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. వ్యాపారంలో ఉత్తమ లాభాలు కలుగుతాయి. బంధు మిత్రులతో కలిసి సమయాన్ని గడుపుతారు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శివాలయం సందర్శించడం మంచిది.
మకర రాశి :
వీరు ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం. ప్రయాణాలు సూచిస్తున్నాయి. వీరి జీవిత భాగ మికి వృత్తిలో గుర్తింపు. నూతన పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి మిశ్రమ ఫలితాలు. వారం మొదటిలో భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు సూచించ పడుతున్నాయి. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం వెంకటేశ్వర వజ్ర కవచము చదవటం శ్రేయస్కరం.
కుంభ రాశి :
వీరి యొక్క సంతానం దూర ప్రాంతాలలో స్థిరపడతారు. సొంత ఊరులో స్థిరాస్తులు కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు కలసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలసి దర్శనీయ ప్రాంతాలు సందర్శిస్తారు. ఎడ్యుకేషనల్ రంగంలో వున్న వారికి కొంత ఊరట లభిస్తుంది. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ని ఆరాధించటం శ్రేయస్కరం.
మీన రాశి :
వీరికి వ్యాపారరీత్యా కలసివస్తుంది. సోదరులకు ఆర్థికసహాయం అందిస్తారు. ఆరోగ్యరీత్యా వైద్యుల సూచనలు తీసుకుంటారు. విద్యార్ధులకి కళాశాల నియామకాల ద్వారా ఉద్యోగ లభించే సూచనలు వున్నాయి. వీరు ఉత్తమ ఫలితాల కోసం లక్ష్మి నరసింహ స్వామిని ఆరాధించటం శ్రేయస్కరం.