Weekly Horoscope From May 9th to May 15th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscopes, Horoscope in Telugu.
ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మే 9 నుండి మే 15 వరకు వారఫలాలు.
మేష రాశి :
ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థిక అభివృద్ధి సున్నితమైన మాట తీరుతో వ్యవహరించటం శ్రేయస్కరం. విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు. వీరు లక్ష్మి నరసింహ స్వామి వారిని సేవించటం ఉత్తమం.
వృషభ రాశి :
ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు. అధిక ఖర్చులు. విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు. దూర ప్రయాణ సూచన. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వీరు శ్రీ మహాలక్ష్మీ ద్వాదశ నామాలు చదవటం శ్రేయస్కరం.
మిథున రాశి :
ఆర్థికపరంగా మిశ్రమ ఫలితాలు. సోదర వర్గం నుండి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ చలనం. వైవాహిక జీవితంలో ఒడిదదుకులు సర్దుకుంటాయి. విద్యార్థులకి అధిక శ్రమ. వీరు బుధ గ్రహ శ్లోక పఠించడం శ్రేయస్కరం.
కర్కాటక రాశి :
వీరికి ఈ వారం మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. వృత్తిలో అభివృద్ధి. తండ్రి వైపు నుండి లాభం. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కి సంబంధించిన లావాదేవీలు ఆలస్యం అవుతాయి . వీరు ఉమా మహేశ్వర స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
సింహ రాశి :
వృత్తిలో గుర్తింపు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికంగా స్వల్ప లాభాలు. దగ్గరి ప్రయాణాలు. కార్యక్రమాల వాయిదా. నూతన పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారంలో మార్పులు. వీరు ఆదిత్య హృదయం చదవటం శ్రేయస్కరం.
కన్య రాశి :
ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు. స్వల్ప ఆదాయం. వృత్తి రీత్యా ప్రయాణం. స్థిరాస్తులు సంబందించిన విషయాలలో అభివృద్ధి. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఉత్తమ ఫలితాలు పొందటం కోసం వీరు సుదర్శన అష్టకం చదవటం శ్రేయస్కరం .
తులా రాశి :
వీరికి ఈ వారం మిశ్రమ ఫలితాలు. ఆర్థిక సమస్యల నుండి స్వల్ప ఊరట, సోదర వర్గం నుంచి శుభవార్తలు. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ మహా లక్ష్మి అష్టోత్తరం చదవటం శ్రేయస్కరం.
వృశ్చిక రాశి :
కొంత మానసిక చికాకులు. గృహ సంబంధంగా అనుకోని ఖర్చులు. నూతన విషయాలు నేర్చుకొనే అవకాశం. వ్యాపార పరంగా స్వల్ప లాభాలు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని సేవించటం ఉత్తమం.
ధనస్సు రాశి :
మిశ్రమ ఫలితాలు. ఆర్ధికం గా అనుకూలంగా ఉంటుంది. విద్యకి సంబందించిన నూతనకోర్స్ విషయాలలో అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోవటం మంచిది. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శివారాధన చెయ్యటం ఉత్తమం.
మకర రాశి :
వీరికి అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. వృత్తిరీత్యా ప్రముఖులతో పరిచయాలు కలిగే అవకాశం. విద్యార్థులకి అధిక శ్రమ. ఆధ్యాత్మిక ఉన్నతి. వ్యాపారంలో మిశ్రమ లాభాలు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించటం శ్రేయస్కరం.
కుంభ రాశి :
ఆర్థిక అభివృద్ధి. స్వల్ప ఆరోగ్య సమస్యలు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు. సంతానం యొక్క అభివృద్ధి. దూర ప్రయాణాల సూచన. విద్యార్థులకి సాధారణ ఫలితాలు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ రామాష్టకం చదవటం శ్రేయస్కరం.
మీన రాశి :
అనుకూల ఫలితాలు. ఆర్ధికం గా స్వల్ప లాభాలు. విద్యార్థులకి అనుకూల సమయం. వివాహ ప్రయత్నాలలో కొంత నిరాశ. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం చంద్రశేఖర అష్టకం చదవటం శ్రేయస్కరం.