Weekly Horoscope From May 30th to June 5th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscopes, Horoscope in Telugu.
ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మే 30 నుండి జూన్ 5 వరకు వారఫలాలు.
మేష రాశి :
ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆదాయం స్వల్పం గా ఉంటుంది. సంతానానికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. వృత్తిలో సానుకూల ఫలితాలు అందుకుంటారు. దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు పొందటం కోసం కనకధారా స్తోత్రం చదవటం శ్రేయస్కరం .
వృషభ రాశి :
వృత్తిలో గుర్తింపు. ఖర్చులు అధికంగా ఉంటాయి. స్థాన చలనం. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం లక్ష్మీనరింహస్వామివారిని సేవించటం ఉత్తమం.
మిథున రాశి :
వైద్యుల సూచనలతో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపార వృద్ధి విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. సోదరులకి ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగంలో సమస్యల నుండి బయట పడతారు. సంతానానికి దూర ప్రయాణం సూచన. ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందటం కోసం గౌరీ అష్టకం చదవటం శ్రేయస్కరం.
కర్కాటక రాశి :
ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారంలో వృద్ధి. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. వృత్తి లో కొంత వొత్తిడి ఎదురు కుంటారు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం చంద్రశేఖర అష్టకం పాటించటం శ్రేయస్కరం.
సింహ రాశి :
ఆరోగ్య పరంగా, వృత్తి పరంగా మంచి గుర్తింపు. ఆదాయం పరంగా మిశ్రమ ఫలితాలు. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కొంత జాప్యం, సంతా సంతానానికి వృత్తిలో మార్పు సూచించ పడుతోంది. ఈ రాశి వాళ్ళు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం సూర్య అష్టకం చదవటం శ్రేయస్కరం .
కన్య రాశి :
శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక వృద్ధి. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకం. వివాహాది శుభ వార్తల శ్రవణం. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు. వృత్తిలో స్థాన చలనం. గృహ లాభం. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం గణపతి ఆరాధన శ్రేయస్కరం.
తుల రాశి :
స్థిరమైన ఆలోచనలు లేకపోవటం వల్ల న పనులు ఆలస్యం అవుతాయి. విద్యార్థుల కి ఉత్తమ ఫలితాలు. వాదనల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్యామల దండకం చదవటం ఉత్తమం.
వృశ్చిక రాశి :
ఆర్థిక లాభం. అన్ని కార్యాలలో విజయం. ఉద్యోగంలో అనుకున్న ప్రాంతానికి స్థానచలనం. శుభ కార్యాల్లో పాల్గొనటం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించాలి. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
ధనస్సు రాశి :
వ్యాపారంలో ఆర్థిక లాభం, నూతన పరిచయాలు. వృత్తి రీత్యా ప్రయాణాలు. విద్యార్ధులకి సానుకూల ఫలితాలు. సంతానానికి అనారోగ్య సూచన. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం సద్గురు ప్రార్థన ఉత్తమం.
మకర రాశి :
శారీరక శ్రమ అధికం అవుతాయి. ఆర్థిక విషయాలలో కొంత అసంతృప్తికి లోను అవుతారు. వృత్తి, వ్యాపారాలలో ఎదుగుదల. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం కనకధారా స్తోత్రము పఠనం చెయ్యటం ఉత్తమం.
కుంభ రాశి :
అనుకోని ప్రయాణాలు. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఆదాయం ఖర్చులు సమంగా వుండటం. విద్యార్థులకు అధిక శ్రమతో ఉత్తమ ఫలితాలు. ఇంటర్వూలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శివాలయ సందర్శన ఉత్తమం.
మీన రాశి :
వృత్తి, వ్యాపారాలలో లాభం. విద్యార్ధులకి ఉత్తమ కాలం. చెవి, చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం. చేపట్టిన కార్యాల్లో విజయం. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయ ప్రార్థన ఉత్తమం.