Weekly Horoscope From May 2nd to May 8th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscopes, Horoscope in Telugu.
ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మే 2 నుండి మే 8 వరకు వారఫలాలు.
మేష రాశి :
కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆదాయం బాగుంటుంది. వీరు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయం లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి అధిక శ్రమ.ప్రయాణాలు వాయిదా వెయ్యటం ఉత్తమం. వీరు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం చదవటం శ్రేయస్కరం.
వృషభ రాశి :
దూర ప్రయాణాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం. వ్యాపారస్తులకు స్వల్ప ఆదాయం, వృత్తి లో మార్పు , అభివృద్ధి. వీరు శ్రీలక్ష్మి ద్వాదశ నామాలు చదవటం శ్రేయస్కరం.
మిథున రాశి :
ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. రుణాలు స్వల్ప మొత్తంలో తీరుస్తారు. నూతన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. వీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యటం ఉత్తమం.
కర్కాటక రాశి :
ఆదాయం బాగుంటుంది. వృత్తిలో గుర్తింపు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు. సంతానం విషయంలో కొంత ఆందోళనకు గురి అయ్యే అవకాశం కలదు. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి. వీరు శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
సింహ రాశి :
సంఘంలో గుర్తింపు. ఆదాయంలో కొంత తగ్గుదల. నూతన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సంతానం యొక్క వివాహ విషయంలో ముందడుగు. వీరు ఆదిత్య హృదయం చదవటం శ్రేయస్కరం.
కన్య రాశి :
ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వృత్తిలో మార్పులు. వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు. వాహనాల కొనుగోలు వాయిదా వెయ్యటం మంచిది.
తులా రాశి :
ఆరోగ్య పరంగా బాగుంటుంది. ఆర్థిక పరం గా స్వల్ప ఫలితాలు. సంతానం జీవితంలో స్థిరపడతారు. విద్యార్థులకి సాధారణ ఫలితాలు. వృత్తిలో స్వల్ప మార్పులు. వీరు శ్రీ మహాలక్ష్మి నీ ఆరాధించటం శ్రేయస్కరం.
వృశ్చిక రాశి :
ఆర్ధికంగా బాగుంటుంది. చేపట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా అయినా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. వ్యాపారంలో కలసి వస్తుంది. వీరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
ధనుసు రాశి :
ప్రయాణ సూచన. ఆర్ధికంగా సానుకూల ఫలితాలు. విద్యార్థులకి శుభ ఫలితాలు. వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకొనేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. వీరు చంద్రశేఖర అష్టకం చదవటం శ్రేయస్కరం.
మకర రాశి :
సాధారణ ఫలితాలు .ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు. తండ్రి మరియు సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పాటించాలి. వాహనాల విషయంలో జాగ్రత్త పాటించాలి. వీరు శ్రీ హనుమాన్ చాలీసా చదవటం శ్రేయస్కరం
కుంభ రాశి :
ఆర్ధికంగా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. వృత్తిలో గుర్తింపు. కుటుంబ సభ్యులతో కలసి సమయం గడుపుతారు. వీరు గౌరీ అష్టకం చదవటం శ్రేయస్కరం.
మీన రాశి :
దూర ప్రయాణాల సూచన. అనుకోని ఖర్చులు. పనుల వాయిదా. వ్యాపారంలో స్వల్ప మార్పులు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామి నీ ఆరాధించటం శ్రేయస్కరం .