Weekly Horoscope From May 16th to May 22nd by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscopes, Horoscope in Telugu.
ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మే 16 నుండి మే 22 వరకు వారఫలాలు.
మేష రాశి :
ఈ రాశి వారికి ఆర్ధికం గా బాగుంటుంది. కుటుంభసభ్యుల మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకోవచ్చును. సంతానం యొక్క విద్య విషయం లో కొంత గందరగోళానికి గురి అవుతారు. వ్యాపార భాగస్వామ్య విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వీరు లక్ష్మి నరసింహ స్వామిని ఆరాధించటం శ్రేయస్కరం.
వృషభ రాశి :
ఈ రాశి వారు అధికారుల వల్ల కొంత వొత్తిడి ఎదురుకుంటారు. వారం మొదట్లో ఆర్థికముగా ఇబ్బంది కలిగి నప్పటికీ, వారం చివర్లో ఆర్థికముగా ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రయాణ సూచన. వ్యాపారంలో స్వల్ప లాభాలు. రాజకీయ నాయకులకి అనుకోని చిక్కులు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం సుదర్శన అష్టకాన్ని చదవటం శ్రేయస్కరం.
మిథున రాశి :
ఆదాయం, ఖర్చులు సమంగా ఉంటాయి. ఇంటర్వ్యూస్ లో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో మంచి ఫలితం అందుకుంటారు. సంతానం వృద్ధి లోకి వస్తారు. వ్యాపారంలో స్వల్ప అభివృద్ధి. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ లక్ష్మి నారాయణ స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
కర్కాటక రాశి :
వీరు ఈ వారం లో మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. వృత్తిలో మార్పు, అభివృద్ధి ఉంటాయి. నూతన కార్యక్రమాలు విజయవంతం పూర్తి చేస్తారు. సోదరుల అభివృద్ధి, ఆర్థిక పరమైన విషయాలలో కుటుంభసభ్యుల మధ్య అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం కలదు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం కనకధారా స్తోత్రము పఠనం చెయ్యటం ఉత్తమం.
సింహ రాశి :
పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ద్వార ఆర్థిక అభివృద్ధి. తండ్రివైపు నుంచి శుభ వార్తలు వింటారు. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు. వీరు సూర్య ద్వాదశ నామాలు చదవటం శ్రేయస్కరం.
కన్య రాశి :
ఆర్ధికంగా స్వల్ప ఆదాయం. ఆలస్యంగా పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్థులు కంపెనీ మారే అవకాశం. సోదరులతో సంబంధాలు మెరుగు పడతాయి. వివాహ ప్రయత్నాలలో వున్నవారికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపస్తోంది. విద్యార్థులకి సానుకూల అయిన ఫలితాలు. వీరు శ్రీ కృష్ణ అష్టకం చదవటం శ్రేయస్కరం .
తుల రాశి :
వీరికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా అభివృద్ధి. క్రీడాకారులకి, విద్యార్థులకి సానుకూల ఫలితాలు. వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు. ఉద్యోగస్తులకు బాగుంటుంది. సుబ్రమణ్య స్వామిని ఆరాధించండి.
వృశ్చికం రాశి :
ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో అభివృద్ధి లోపిస్తుంది. విద్యార్థులు అధిక శ్రమ చెయ్యవలిసి ఉంటుంది. వృత్తి లో అభివృద్ధి మరియు అధికారుల నుండి వొత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపారం నెమ్మదిగా కొనసాగుతుంది. వీరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించటం శ్రేయస్కరం.
ధనస్సురాశి :
పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయం లో కొంత జాగ్రత్త గా వ్యవహరించాలి. ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. వృత్తిలో మార్పులు, కొంత వొత్తిడి సూచన. విద్యార్థులు నూతన కోర్సులలో జాయిన్ అయ్యే అవకాశం కలదు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ దక్షిణ మూర్తి నీ ఆరాధించటo శ్రేయస్కరం.
మకర రాశి :
ఈ రాశి వారికి వారం చివరలో శుభ ఫలితాలు. అనుకోని ఖర్చులు, ప్రయాణాల సూచన. విద్యార్థులకి మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం. క్రీడా కారులకి గడ్డు కాలం. వ్యక్తిగత మరియు వృత్తి జీవితం లో కొంత వొత్తిడి ఎదురుకుంటారు. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచము చదవటం శ్రేయస్కరం.
కుంభ రాశి :
ఆరోగ్యం విషయం లో జాగ్రత్త అవసరం. ఆర్ధికంగా బాగుంటుంది. సోదర మరియు స్నేహితుల యొక్క సహకారం అందుతుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకి సానుకూల ఫలితాలు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత నిరాశ. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శని గ్రహ శ్లోకం చదవటం శ్రేయస్కరం.
మీన రాశి :
ఈ రాశి వారికి స్వస్థలానికి ప్రయాణ సూచన. అనుకోని విధంగా ధన లాభం. నూతన కార్యక్రమాల వాయిదా. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత నిరాశ. నూతన విషయ పరిజ్ఞానం కలుగుతుంది. ఈ రాశి వారు చంద్రశేఖర అష్టకం చదవటం శ్రేయస్కరం.