Weekly Horoscope From July 4th to July 10th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.
Horoscope: ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా జూలై 4rh నుండి జూలై 10th వరకు వారఫలాలు.
మేష రాశి :
ఆర్థిక పరమైన సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. విద్యార్థులకి అధిక శ్రమ. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ మార్పు కోసం ప్రయతిస్తున్న వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. వీరు కుజ గ్రహ శ్లోకం చదవటం శ్రేయస్కరం.
వృషభ రాశి :
వైవాహిక జీవితంలో సమస్యల నుంచి పెద్దల సహకారం వల్ల బయట పడతారు. వృత్తిలో స్థాన చలనం. వారసత్వ ఆస్తుల విషయం లో కొంత అనుకూలత. వ్యాపారస్తులకు సామాన్యం ఫలితాలు. ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు. వీరు గౌరి అష్టకం చదవటం శ్రేయస్కరం.
మిథున రాశి :
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అధికారుల వల్ల వత్తిడి ఎదుర్కొనే అవకాశం. కొత్త రుణాలు చేసే అవకాశం కలదు. Interviews and competitive exams లో విజయం సాధిస్తారు. సొదరవర్గం నుంచి శుభవార్తలు వింటారు. వీరికి శ్రీ కృష్ణ అష్టకం చదవటం వల్ల విజయం చేకూరుతుంది.
కర్కాటక రాశి :
ఆదాయం బాగుంటుంది. నూతన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కంటికి సంబంధించి ఆనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం యొక్క వృత్తి విషయంలో శుభ వార్తలు వింటారు. వీరు శివాలయం సందర్శనం చెయ్యటం ఉత్తమం.
సింహ రాశి :
వృత్తిలో గుర్తింపు పొందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థిర ఆస్తుల కొనుగోలుకి అనుకూల సమయం. క్రీడాకారులకు అనుకూల సమయం. వీరు రవి గ్రహ శ్లోకం చదవటం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు.
కన్య రాశి :
అధికారులతో పరిచయం. ప్రభుత్వ రంగ ఉద్యోగాలకి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూల సమయం. ధనాభివృద్ధి. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి. సంతాన పరంగా సానుకూల ఫలితాలు. వీరు విష్ణు సహస్ర నామం పారాయణం చెయ్యటం ఉత్తమం.
తులా రాశి:
వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలు ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. Interviews లో విజయం కోసం అధిక శ్రమ చెయ్యవలసి ఉంటుంది. సోదరులతో సత్సంబంధాలు. వీరికి అనుకూల ఫలితాలు కోసం కనకధారా స్తోత్రము పఠనం చెయ్యటం ఉత్తమం.
వృశ్చిక రాశి :
ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకి సానుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు. నూతన గృహోపకరణాలు కొనుగోలు. విదేశీ ప్రయత్నాలు కలసి వస్తాయి. వీరు సుబ్రమణ్య స్వామి వారిని ఆరాధించటం శ్రేయస్కరం.
ధనస్సురాశి :
పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులయొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త గా వ్యవహరించాలి. ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. వృత్తిలో మార్పులు, కొంత వొత్తిడి సూచన. విద్యార్థులు నూతన కోర్సులలో జాయిన్ అయ్యే అవకాశం కలదు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ దక్షిణ మూర్తిని ఆరాధించటo శ్రేయస్కరం.
మకర రాశి :
ఈ రాశి వారికి వారం చివరలో శుభ ఫలితాలు. అనుకోని ఖర్చులు, ప్రయాణాల సూచన. విద్యార్థులకి మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం. క్రీడాకారులకి గడ్డు కాలం. వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కొంత ఒత్తిడి ఎదురుకుంటారు. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచము చదవటం శ్రేయస్కరం.
కుంభ రాశి :
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధికంగా బాగుంటుంది. సోదర మరియు స్నేహితుల యొక్క సహకారం అందుతుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకి సానుకూల ఫలితాలు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత నిరాశ. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శని గ్రహ శ్లోకం చదవటం శ్రేయస్కరం.
మీన రాశి :
ఈ రాశి వారికి స్వస్థలానికి ప్రయాణ సూచన. అనుకోని విధంగా ధన లాభం. నూతన కార్యక్రమాల వాయిదా. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత నిరాశ. నూతన విషయ పరిజ్ఞానం కలుగుతుంది. ఈ రాశి వారు చంద్రశేఖర అష్టకం చదవటం శ్రేయస్కరం.