Weekly Horoscope From April 11th to April 17th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant,
ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 17 వరకు వారఫలాలు.
మేష రాశి :
వృత్తి రీత్యా లాభం చేకూరుతుంది. దగ్గర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వారం రెండో భాగంలో కొంత వొత్తిడి కలుగుతుంది. పిల్లలకి వాహనాలు ఇ చ్చె విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వీరు సుబ్రమణ్య స్వామిని ఆరాధించటం మంచిది.
వృషభ రాశి:
కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయం లో జాగ్రత్త పాటించాలి. నూతన పెట్టుబడులు పెట్టడం లో జాగర్త గా నిర్ణయం తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. విద్యార్ధులకి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అధికారుల నుండి వొత్తిడి ఎదురు కుంటారు. అన్నపూర్ణాష్టకం చదవటం శ్రేయస్కరం.
మిథున రాశి:
ఆదాయం విషయంలో మిశ్రమ ఫలితాలు. పిల్లల విద్య విషయంలో లోన్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార పరంగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వీరు దక్షిణా మూర్తి యొక్క శ్లోకం చదవటం శ్రేయస్కరం.
కర్కాటక రాశి :
వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఆరోగ్య పరంగా వైద్యుల సూచనలు తీసుకోవటం మంచిది. వృత్తిలో అధికారుల నుండి వొత్తిడి ఎఎదురుకొనవలసి వస్తుంది ,అదే విధంగా ఆర్థిక పరంగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారం లో లాభాలు. వీరు విష్ణు మూర్తినీ ఆరాధించటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
సింహ రాశి:
వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు. అధిక వ్యయం సూచన. వృత్తి రీత్యా స్వల్ప ఆదాయం. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. వీరు సూర్యఅష్టకం చదవటం శ్రేయస్కరం.
కన్య రాశి:
దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వీరికి శివాలయ సందర్శన ఉత్తమ ఫలితాలు కలుగ చేస్తుంది.
తులా రాశి:
ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు. వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. వృత్తిలో అభివృద్ధి. ఆర్థిక పరమైన సమస్యల నుండి ఉపశమనం. విద్యార్థులకి ఉత్తమ ఫలితాలు. వీరు చంద్రశేఖర అష్టకం చదవటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి:
వారం యొక్క రెండవ భాగంలో ఆరోగ్యం అనుకూలిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సంతానానికి దూర ప్రయాణం సూచిస్తోంది. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకొనే అవకాశం కలదు. వీరు అర్ధనారీశ్వర స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
ధనస్సు రాశి:
ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వీరు శివాలయ సందర్శన ద్వార శుభ ఫలితాలు పొందుతారు.
మకర రాశి:
నూతన కార్యక్రమ లను విజయవంతంగా చేపడ్డతారు. వృత్తిలో అభివృద్ధి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయం లో జాగర్త అవసరం. స్థిర ఆస్తుల కొనుగోలు విషయంలో కొంత కాలం వేచి చూడటం మంచిది. వీరు వెంకటేశ్వర ఆరాధన వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
కుంభ రాశి:
విద్య విషయంలో ముందుకి వెళ్తారు. వారసత్వ సంపద కలిసి వస్తుంది. వ్యాపారంలో ఆకస్మిక మార్పులు చోటచేసుకుంటున్నాయి. నూతన గృహపకరణాలు కొనుగోలు చేస్తారు. వీరు లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
మీన రాశి:
వృత్తిలో స్థాన చలనం. మానసిక చికాకులు, వొత్తిడి ఎఎదురుకొనవలసి వస్తుంది. వ్యాపార రీత్యా లోన్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులకి అధిక శ్రమ,వాహన యోగం. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామి నీ ఆరాధించటం శ్రేయస్కరం.