Rachakonda News : చైన్ స్నాచర్ల మీద ఉక్కుపాదం మోపుతాం
రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు ఈరోజు కమీషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ లో ఈ సంవత్సరంలో మొత్తం 25 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా క్రైమ్ సిబ్బంది, సిసిఎస్ ఎల్బీనగర్, ఐటీ సెల్ సహకారంతో అన్నిటినీ త్వరితగతిన విచారణ జరిపి అన్ని కేసులను పరిష్కరించిన అధికారులు మరియు 18 మంది సిబ్బంది ఈ రోజు రాచకొండ కమిషనరేట్లో ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా అహర్నిశలు కృషి చేస్తున్నామని, మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో సీసీటీవీలను విస్తృతంగా వినియోగించడం కూడా కేసుల విచారంలో అధికారులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిని మరియు చైన్ స్నాచర్లనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కమిషనర్ హెచ్చరించారు. ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, ఎస్ఓటి డిసిపి మురళీధర్, ఎస్ఓటి అడిషనల్ డీసీపీ నంద్యాలనరసింహారెడ్డి, వనస్థలిపురం ఏసిపి కాశిరెడ్డి, వనస్థలిపురం, మీర్పేట్ డిఐలు తదితరులు పాల్గొన్నారు.