బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు నిర్మించారు. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘అన్ స్టాపబుల్’ టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. అందరూ యంగ్ స్టర్స్ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కు నా వంతుగా ఉపయోగపడాలని ఈ వేడుకకు వచ్చాను. డైమండ్ రత్న బాబు అంటే నాకు చాలా ఇష్టం. మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. నా కామెడీ అంటే తనకి చాలా ఇష్టం. ఈ సినిమాలో నన్ను పెట్టడానికి చాలా ప్రయత్నించారు కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాదాపు యాభై మంది నటీనటులతో ఈ సినిమా చేయడం ఆనందాన్ని ఇచ్చింది.
సన్నీ, సప్తగిరి, బిత్తిరి సత్తి ,షకలక శంకర్, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, చమ్మక్ చంద్ర.. ఇలా ఎంతోమంది నటీనటులతో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. జంధ్యాల గారు, రేలంగి నరసింహరావు గారు, ఈవీవీ గారు, ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాల్లో ఇలా తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్ళీ ఇంతమందిని ఒక్క దగ్గరికి చేర్చి అన్ స్టాపబుల్ లాంటి మంచి ఎంటర్ టైనర్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది.
యువ దర్శకులు, నటులు, నిర్మాతలని ప్రోత్సహించాలి. అప్పుడే పరిశ్రమకు కొత్త ప్రతిభ వస్తుంది. యువ నిర్మాతలు రజిత్ రావు, రఫీలకి ఆల్ ది బెస్ట్. చిత్ర బృందం అంతా కష్టపడి చేసిన ఈ ప్రాజెక్ట్ అద్భుతమైన విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను. ఇందులో వున్న నటులని చూస్తుంటే ముప్ఫై ఏళ్ల క్రితం ఇలానే ఉండేవాడని కదా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళందరిని మీరందరూ ఆశీర్వదిస్తే పెద్దవాళ్ళు అవుతారు. గొప్ప వారు అవుతారు. తర్వాత ప్రతి ఒక్కరూ ఒక బ్రహ్మానందం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.