ఫలక్నుమా దాస్, పాగల్, హిట్ , చిత్రాల హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న నూతన చిత్రం `దాస్ కా ధమ్కీ` బుధవారం నాడు ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో ఆహ్లాదకరమైన వాతావరణం లో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేత పేతురాజ్ పై ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించారు. దీనికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. `ఎఫ్3` దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా స్క్రిప్ట్ను నిర్మాత, దర్శకుడి కి రచయిత ప్రసన్నకుమార్ అందజేశారు. అనంతరం అల్లు అరవింద్ టైటిల్ లోగో ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, యంగ్ హీరోలలో నా కిష్టమైన వారిలో విశ్వక్ ఒకరు. విశ్వక్ తొలి సినిమా నుంచి పరిశీలిస్తున్నాను. సంతోషం వచ్చినా ఏది వచ్చినా తట్టుకోలేడు. ఈ సినిమా మంచి విజయాన్ని చేకూర్చాలి. నివేత పేతురాజ్ కూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. `ధమ్కీ` టైటిల్కు తగినట్లే కథ వుంటుందనీ, అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాని అన్నారు.నటీనటులు: విశ్వక్ సేన్, నివేత పేతురాజ్
సాంకేతిక సిబ్బంది: నిర్మాతః కరాటే రాజు, దర్శకత్వం : నరేశ్ కుప్పిలి, రచయితః ప్రసన్నకుమార్ బెజవాడ,
కెమెరాః దినేష్ కె.బాబు, సంగీతం: లియోన్ జేమ్స్, ఎడిటర్ః అన్వర్ అలీ, ఆర్ట్ః ఎ. రామాంజనేయులు, పి.ఆర్.ఓ. వంశీ, శేఖర్, పబ్లిసిటీ డిజైనర్ః పద క్యాసెట్ట్