టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విమర్శకులకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన కోహ్లీపై విమర్శలు ఎక్కువయ్యాయి. అతడిని టీమ్ ఇండియా నుంచి తొలగించాలంటూ ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో వాటన్నింటికీ కోహ్లీ ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చాడు. ‘‘డార్లింగ్ నేను కింద పడిపోతే ఏంటి.. నువ్వు పైకి ఎగిరితే ఏంటి’’ అంటూ తనను టార్గెట్‌చేసి కామెంట్ చేసిన వారికి పరోక్షంగా రిప్లై ఇచ్చాడు. ఈ మేరకు ఓ ఫొటోను కోహ్లీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్‌గా మారి ట్రెండింగ్‌లో ఉంది.