విరాట్ కర్ణ, శ్రీకాంత్ అడ్డాల, మిర్యాల రవీందర్ రెడ్డి, ద్వారకా క్రియేషన్స్ ‘పెద్ద కాపు-1’ ఇంటెన్స్ & రివెటింగ్ టీజర్ విడుదల
సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మొదట్లో సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేశారు. ‘నారప్ప’లో అద్భుతమైన టేకింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అఖండను అందించిన ద్వారకా క్రియేషన్స్ మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి చేస్తున్న’పెద్ద కాపు-1’ కోసం గేర్ మార్చారు. ఈ న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామాలో విరాట్ కర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్.. ఈరోజు టీజర్‌ను విడుదల చేశారు.
తన గత సినిమాలకు భిన్నంగా ఇంటెన్స్, పొలిటికల్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరిచారు శ్రీకాంత్ అడ్డాల. ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ చేసిన ప్రముఖ రాజకీయ ప్రసంగంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల ఆధిపత్యం ఉన్న గ్రామంలో ఒక సాధారణ వ్యక్తి పాలనను చేపట్టడం అనేది కథాంశం. ఈ ఇద్దరి మధ్య చావు తప్ప గ్రామస్తులకు వేరే మార్గం లేదు.
అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. శ్రీకాంత్ అడ్డాల కథ-కథనంలో తన బ్రిలియన్స్ చూపించారు. కథానాయకుడి పాత్ర ఒక సాధారణ వ్యక్తి నుండి రెండు పవర్ ఫుల్ శక్తులకు వ్యతిరేకంగా చేసిన పోరాటంవరకు అద్భుతంగా సాగింది. విరాట్ కర్ణ అనుభవం వున్న నటుడిగా తన పాత్రలో ఎంతో సహజంగా కనిపించారు. పాత్రకు కావలసిన ఇంటెన్సిటీ అతని నటనలో ఉంది.
డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. గ్రామ నాయకులుగా రావు రమేష్ , ఆడుకలం నరేన్ పవర్ ఫుల్ గా కనిపించారు. తనికెళ్ల భరణి, నాగబాబు ప్రజన్స్ ఆకట్టుకుంది. టీజర్ చివర్లో శ్రీకాంత్ అడ్డాల కనిపించడం మరో సర్ప్రైజ్.
ఛోటా కె నాయుడు కెమెరా బ్లాక్‌లు అద్భుతంగా ఉన్నాయి. మిక్కీ జె మేయర్ అద్భుతమైన బీజీఎం తో ఇంటెన్సిటీని జోడించారు. రివర్టింగ్ టీజర్ నెక్స్ట్ రి ప్రమోషనల్ మెటీరియల్ కోసం అంచనాలు పెంచింది. నిర్మాణ విలువలు అత్యున్నతంగా వున్నాయి.
మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ఇండియన్ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రాఫర్. ఆగస్ట్ 18న సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు అనౌన్స్ చేశారు.