Bhakthi విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రులు ఘనంగా జరిగాయి అయితే చివరి రోజు కృష్ణానదిలో హంస వాహనంపై అమ్మవారి నదీ విహారాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు.
విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరిగాయి నవరాత్రుల పాటు జరిగిన ఈ వైభవానికి చూడడానికి ఇరు రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేశారు అయితే ప్రతి ఏడూ చివరి రోజు జరిగే కృష్ణానదిలో హంస వాహనంపై అమ్మవారి నదీ విహారాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు.కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో దిగువకు వరద ప్రవాహం ఎక్కువగా వుంది.. తాకిడితో పలు ప్రాంతాలు ప్రమాదంలో ఉన్నాయి అయితే ఈ సందర్భంగా అమ్మవారి తెప్పోత్సవాన్ని నిర్వహించలేదని తెలిపారు..
దేవి నవ రాత్రుల్లో చివరి రోజైన బుధవారం రాజరాజేశ్వరిదేవి అలంకారములో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఉత్సవాల ముగింపులో భాగంగా దుర్గమ్మను, గంగామాత సమేత మల్లేశ్వరస్వామివార్లతో కృష్ణవేణి నదిపై వీరిని ఊరేగించే కార్యక్రమాన్ని ఈ ఏడాది నిలిపివేశారు.. నవరాత్రుల్లో భాగంగా తొమ్మిదవ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనం ఇచ్చారు విజయవాడ కనకదుర్గ మన దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అనంతరం క్యూలైన్లలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. అయితే విజయదశమి రోజున నిర్వహించే తెప్పోత్సవ నిర్వహణ నది ఒడ్డున జరుగనుంది.