Crime సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.. ప్రముఖ హిందీ సీరియల్ నటి వీణాకపూర్ దారుణ హత్యకు గురయ్యారు.
హిందీ చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా మంచి నటిగా పేరు సంపాదించుకొని పలు సినిమాలు సీరియల్ లో నటించిన వీణ కపూర్ దారుణ హత్యకు గురైంది.. ఆస్తి కోసం కన్న కొడుకే ఆమెను బేస్‌బాల్ బ్యాట్‌తో దారుణంగా కొట్టి చంపేశాడు. ఇంట్లో పనిచేసే వ్యక్తి సాయంతో డెడ్ బాడీని దగ్గరలో ఉన్న నదిలో పడేశాడు. అయితే హత్య జరిగి కొన్ని రోజులు అవ్వగా ఈ విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
వినా కపూర్ హత్యకు గురి అయిన సంగతి తెలుసుకునే ఇండస్ట్రీ షాప్ గురైంది.. ఆమెతో కలిసి నటించిన పలువురు బుల్లితెర నటీనటులు వీణాకపూర్‌కు నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరోవైపు కన్నతల్లిని కనికరం లేకుండా హతమార్చిన వీణాకపూర్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు..
వీణా కపూర్ దాల్ ది గ్యాంగ్, బంధన్ ఫేరోన్ కే వంటి వంటి బాలీవుడ్ హిందీ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కాగా ఆమె ప్రస్తుతం ముంబైలోని జూహూ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. ఆమె ఉంటున్న ఫ్లాట్ విలువే దాదాపు రూ.12 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అయితే దీని విషయంలో ఆమె రెండో కుమారుడు సచిన్‌తో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని ఈ నేపథ్యంలోనే అతను ఆమెను ఇంత దారుణంగా హత్య చేసి ఉన్నాడని తెలుస్తోంది..