Vakkantham Vamsi : సినీ రచయితగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వక్కంతం వంశీ. సురేందర్ రెడ్డి సినిమాలకు వంశీ ఎక్కువగా కథలు అందించేవాడు. ఈ కాంబోలో తెరకెక్కిన కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి. అయితే కిక్ 2 ఫ్లాప్ కావడంతో సురేందర్ రెడ్డి, వక్కంతం మధ్య కాస్త దూరం పెరిగింది. ఆ తరువాత వంశీ పక్కకు వచ్చి.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీతో దర్శకుడిగా మారారు. అయితే అది ఫ్లాప్ అవ్వగా.. వక్కంతంకు మరో హీరో ఎవరూ ఇంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు. తాజాగా ఈ స్టార్ రైటర్ ‘అలీతో సరదాగా’ టాక్ షోకి వచ్చాడు.
ఈ క్రమం లోనే తాను ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, తన పర్సనల్ లైఫ్ లోని పలు ఆసక్తికర విషయాలను ఈ షో లో పంచుకున్నారు. వంశీ రైటర్ గా , డైరెక్టర్ గానే కాకుండా హీరోగా కూడా ఒక సినిమా చేశాడట. దాసరి నారాయణ దర్శకత్వంలో యాంకర్ సుమ హీరోయిన్ గా, వక్కంతం వంశీ హీరోగా ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ అనే చిత్రం తెరకెక్కించిన విషయాన్ని అలీ గుర్తు చేశాడు. ఇక తనకి రచయితగా మంచి గురింపు తెచ్చిపెట్టింది రవితేజ నటించిన ‘కిక్’ సినిమా అని తెలియజేశాడు వంశీ. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి టెంపర్ కథ చెప్పినప్పుడు నేను ఆ కథకి సెట్ అవుతానా అని తారక్ అడిగినట్లు చెప్పాడు.
కాగా ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే మైల్ స్టోన్ గా మారిపోయింది. అలాగే వక్కంతం వంశీని దర్శకుడిని చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చాడట… కానీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మాత్రం ఆయనతో కుదర్లేదని తెలిపాడు. ప్రస్తుతం మళ్ళీ రైటర్ గానే కెరీర్ ని ముందుకు సాగిస్తున్నానని… అఖిల్, సురేందర్ రెడ్డి కాంబోలో వస్తున్న ‘ఏజెంట్’ మూవీకి కథని అందిస్తున్నట్లు వెల్లడించారు.