Rainwater : వర్షంలో తడవడం అందరికీ ఇష్టం.. వర్షపు నీటిలో తడుస్తూ ఫ్రెష్‌గా ఫీలవుతారు. కానీ వర్షం వస్తుంటే ఆ నీటిని తాగరు. వర్షపు నీటిని తాగడం మంచిదా? కాదా?
మనుష్యులు, జంతువులు, మొక్కల మనుగడకు మంచినీరు ముఖ్యమైన వనరు. వర్షపు నీరు బావులు, సరస్సులు, నదుల్ని నింపుతుంది. మన ఇళ్లలో మనం తాగే నీరంతా వర్షం నుండే లభిస్తుంది. అయితే వర్షం నీరు డైరెక్ట్‌గా మనం తాగం. ఈ నీరు నిజంగా స్వచ్ఛమైనదేనా? అని అనుమానం వస్తుంది. వర్షం వాతావరణలో ఉండే వాయువులతో కూడి ఉంటుంది. ఎందుకంటే గాలిలో కార్బన్‌డయాక్సైడ్ నీటితో చర్య జరిపి కార్బోనిక్ అమ్లంగా మారుతుంది. వర్షపు నీరు బాక్టీరియా, పరాన్న జీవులు, వైరస్‌లు, రసాయనాలను మోసుకెళ్తుంది. దాంతో అనారోగ్యాలకు గురి చేస్తుంది. అంతేకాదు అనేక వ్యాధులతో ముడిపడి ఉంటుంది.
వర్షపు నీటిని తాగడానికి, వంట చేయడానికి, పళ్లు తోముకోడానికి, కూరగాయల్ని శుభ్రం చేయడానికి ఉపయోగించరు. ఆకాశం నుంచి నేరుగా కురిసిన వర్షపు నీరు మంచిదే కానీ.. అది మొక్కలు, భవనాలను తాకుతూ కురిసినదై ఉండకూడదు. వర్షపు నీటిని మరిగించి, ఫిల్టర్ చేసి తాగడం కొంతవరకూ సురక్షితం.
వర్షంలో తడవడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే తడిసిన తరువాత అనేక అనారోగ్యాలు వస్తుంది. ముఖ్యంగా జలుబు, జ్వరం.. ఇక వీటితో పాటు జుట్టు, చర్మ ఆరోగ్యం విషయంలో కూడా ప్రభావం చూపిస్తుంది. వర్షపు నీరు జుట్టుని బలహీనపరుస్తుంది. ఎక్కువగా వర్షంలో తడిస్తే జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉందట. అలాగే వర్షంలో తడిస్తే తేలికపాటి షాంపూలను వాడాలి. వర్షంలో తడుస్తుంటే మానసికంగా సంతోషంగా అనిపిస్తుంది.