Burning Tongue : చాలా మందికి వేడివేడి పదార్థాలు తీసుకున్నప్పుడు నాలుక కాలే ఉంటుంది. ఇలా జరిగినప్పుడు కొంతమందికి నొప్పి కూడా ఉంటుంది.
వేడివేడిగా కాఫీ, టీ తాగినా, ఏదైనా తిన్నా నాలుక కాలడం సాధారణం. ఒక్కసారిగా వేడి పదార్థాలు నాలుకపై పడడం వల్ల ఇలాంటి జలదరింపు ఉంటుంది. ఇష్టమైన ఆహారం కనబడినప్పుడు వేడి గురించి మరిచిపోయి ఇలా నోట్లో పెట్టుకుంటారు. దీని వల్ల ఒక్కసారిగా నాలుక కాలి.. చిన్నగా మంటగా అనిపించి పొక్కులు ఏర్పడతాయి. ఇలా జరిగాక కొంతమందికి రెండు, మూడు రోజులకి పరిస్థితి మామూలుకి వస్తే.. మరికొంతమందికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా వెంటనే సమస్యని పరిష్కరించొచ్చు కొన్ని టిప్స్‌తో. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
చల్లగా తినండి..
కాలిన మంటని నుంచి ఉపశమనానికి చల్లని పదార్థాలు తినడం మంచిది. ఐస్ క్యూబ్స్ తీసుకుని నోటిలో పెట్టుకుంటూ చూయింగ్ చేయొచ్చు. దీని వల్ల చాలా వరకూ రిలీఫ్ ఉంటుంది. ఈ పరిస్థితిలో చల్లని నీరు కూడా తాగొచ్చు.
పసుపు..
పసుపు అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. పసుపులో అనేక గొప్ప ఔషద గుణాలు ఉన్నాయి. పసుపు రంగు, రుచి పోషకాలని అందిస్తుంది. పసుపులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను నాలుక మంటని తగ్గిస్తుంది. మరి ఎలా తీసుకోవాలంటే 1, 2 టేబుల్ స్పూన్ల పాలు, పావు టీ స్పూన్ తేనె తీసుకుని పేస్టు చేయండి. మీ వేలుతో ఈ పేస్టుని నాలుకపై రాయండి. 10 నిమిషాలు అలానే ఉంచి మీ నోటిని క్లీన్ చేసుకోండి.