Urvashi Rautela : బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. బాలీవుడ్ లో తనడైన శైలిలో నటిస్తూ దూసుకుపోతున్న ఈ అమ్మడికి సోషల్ మీడియాలో కూడా ఫుల్ క్రేజ్ ఉందని చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ తన ఫాలోయింగ్ ని పెంచుకుంటూ ఉంటుంది ఈ భామ. అయితే ఇటీవల కాలంలో తన బాయ్ ఫ్రెండ్ గురించి చాలా రోజులుగా అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కొంతకాలంగా ఆర్పీ, ఆర్పీ అంటూ తన సోషల్ మీడియా పోస్టులలో మెన్షన్ చేస్తూ వస్తోంది ఊర్వశి. దీంతో ఆర్పీ అంటే ఋషబ్ పంత్ అనే అందరూ కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఒకే ఒక్క పిక్‌తో అన్ని రూమర్లకు చెక్ పెట్టిందీ భామ.
ఊర్వశి కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో ‘మిస్టర్ ఆర్పీ’ అంటూ మాట్లాడింది. “రీసెంట్గా ఆర్పీ, నేను ఢిల్లీలో కలుసుకోవాల్సి ఉంది. అప్పుడు ఆర్పీ నా కోసం వేచి చూశాడు. కానీ షూట్ తర్వాత బాగా అలసిపోయా. అందుకే నిద్ర పట్టింది. కాబట్టి అతని కాల్స్ లిఫ్ట్ చేయలేదు. దాంతో అతడు అలిగి వెళ్లిపోయాడు. ఆర్పీ అంటే ఎవరో నేను బయటకు చెప్పాలనుకోవడం లేదు” అని ఈ మాజీ మిస్ యూనివర్స్ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కూడా ఆర్పీ పేరు తన సోషల్ మీడియా పోస్టులలో పేర్కొంది. ఆర్పీ అంటే రిషబ్ పంత్ అని అందరూ అనుకున్నారు. అందుకే అటు క్రికెట్, ఇటు సినిమా ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. రిషబ్ పంత్‌ను వదిలేయాలంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఆమెను విమర్శించారు. అందుకు రిషబ్ పంత్ కూడా ” కేవలం పబ్లిసిటీ కోసం, హెడ్‌లైన్స్‌లో నిలవడం కోసం కొందరు ఇంటర్వ్యూలలో అబద్ధాలు చెబుతుండటం హాస్యాస్పదంగా ఉంది. మే గాడ్ బ్లెస్ థెం. నన్ను వదిలేయండి, సిస్టర్” అని ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కి స్పందిస్తూ.. “చోటు భయ్యా, నువ్వు నీ క్రికెట్ ఆడుకో” అని ఊర్వశి సమాధానం చెప్పింది.
అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. మొన్నటిదాకా ఆర్పీ అంటే రిషబ్ పంత్ గురించే ఈమె మాట్లాడుతుందని అనుకున్న వారందరికీ ట్విస్ట్ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. ఇతడే తన ఆర్పీ అని క్లారిటీ ఇచ్చింది. ర్యామ్‌ను ట్యాగ్ చేసి అతని యూజర్ నేమ్ పక్కనే రోజ్ ఫ్లవర్, లవ్ సింబల్ ఎమోజీలను జత చేసింది.