శ్రీ కాశీ ఆశ్రయ ట్రస్టు ఆధ్వర్యంలో దేశంలోని ఏ సేవా సంస్థ చేపట్టని ప్రప్రథమ ప్రాజెక్టు బీద వారికి ప్రతినెలా ఉచిత కాశీయాత్ర నిర్వహిస్తున్నట్లు శ్రీ కాశీ ఆశ్రయ ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ అశోక్ గుప్త తెలిపారు. సుమారు 60 మందిని ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాశీ యాత్రకు పంపించారు.
అనంతరం ఫౌండర్ ప్రెసిడెంట్ అశోక్ గుప్త మాట్లాడుతూ… ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా ప్రతి నెలా కొంతమందికి ఉచితంగా కాశీయాత్ర ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఈ మార్చి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు సుమారు 60 మంది బీదవారికి 9 రోజుల ఉచిత కాశీయాత్ర సకల సదుపాయాలతో ఏర్పాటు చేశామన్నారు. రాను, పోను రైలు టికెట్లు, ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
గత సంవత్సర శివరాత్రి నుండి ప్రతినెలా కొంత మంది చొప్పున పంపిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 110 మంది సేవ వినియోగించు కున్నారని తెలిపారు. ఈ సదవకాశాన్ని పేదలు వినియోగించుకోవలని తెలిపారు.