Crime ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో భారీ చోరీ జరిగింది సినిమా స్టైల్ లో దుండగులు చోరీకి పాల్పడి అక్కడ నుంచి డబ్బులను దోచుకెళ్లారు ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది..
గుంటూరులోని కెవిపి కాలనీలో లాలూపురం రోడ్డులో కంపెనీలో చోరీ జరిగింది దుండగులు తెలివిగా స్కెచ్ వేసి ఇక్కడ నుంచి సొమ్మును తీసుకెళ్లారు ఈ కంపెనీలో మిర్చీకి సంబంధించిన డీలింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ నుంచి మలేషియాకు మిర్చి ఎగుమతి అవుతూ ఉంటుంది అయితే ఎన్నో రోజుల నుంచి ఈ విషయాలన్నీ చూసుకుంటూ వస్తున్న దుండగులు తెలివిగా స్కెచ్ వేసి డబ్బును దొంగలించేశారు.. ఇక్కడ ఎప్పుడు కూడా పది నుంచి 20 లక్షల వరకు క్యాష్ ఉంటుంది అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న దుండగులు.. తెలివిగా ప్రవర్తించారు ఇద్దరు దొంగలు బైక్ మీద వచ్చి అక్కడే గేటు దగ్గర ఉన్న కుక్కకు చికెన్ ముక్కలు వేసి దాన్ని అరవకుండా చేశారు.. ఈ క్రమంలో అక్కడే ఉన్న వాచ్మెన్ ఆవులయ్య ఈ విషయాన్ని చూసి ఎవరిని ప్రశ్నించగా అతన్ని కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి బెదిరించారు అలాగే అరిస్తే చంపేస్తామంటూ అనటంతో ఆయన ఇంకేమీ చేయలేకపోయారు.. అలాగే వచ్చిన వారిలో ఒక దొంగ బయట నుండగా మరొకరు తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లి డబ్బును అపహరించారు.. అలాగే ఇందులో 20 లక్షలకు పైగా డబ్బు పోయిందంటూ కంపెనీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరిపిస్తున్నారు..