Crime News : ఆంధ్రప్రదేశ్లో రోజుకి 10 సంఖ్యలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వార్తలను మనం చదువుతూనే ఉంటున్నాం. ఈ రోజుల్లో ఇంట్లో నుంచి బయటకు వెళితే మళ్ళీ తిరిగి వచ్చేవరకు భయం భయంగానే ఉంటారు కుటుంబ సభ్యులు. కానీ కొంతమంది దురుసుగా వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించిన ప్రజలను వాటిని పట్టీ పట్టనట్టు వదిలేయడం సహజమే. రోడ్డు ప్రమాదాలపై మరణించిన వారి కుటుంబాలు ఆవేదన అంతా ఇంతా ఉండదనే చెప్పుకోవాలి .
అయితే ఇటువంటి సంఘటన అనకాపల్లి రోడ్డు లో ఒక విషాదం చోటు చేసుకుంది. అచ్యుతాపురం మండలం చోడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక పాదచారుడు రోడ్డును దాటుతున్న క్రమంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గోపి అనే వ్యక్తి బైక్ పై వెళుతున్న తరుణంలో పాదచారుడుని ఢీకొట్టి బైక్.. పల్టీలు కొట్టడంతో గోపి పాదచారుడు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఘటన స్థలంలో ఉన్న కొంతమంది స్థానిక పోలీసులకు సమాచారం తెలపడం జరిగినది.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అస్తవ్యస్తంగా పడి ఉన్న ఆ ఇద్దరిని పరిశీలించి కేసు నమోదు చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించడం జరిగింది. అలానే మృతి చెందిన ఇద్దరు కుటుంబాల వ్యక్తుల వివరాలు తెలుసుకొని తమ తమ కుటుంబాలకు పోలీసులు బృందం తెలపడం జరిగింది. దీనిపై దర్యాప్తు నిమిత్తం కేసు నమోదు చేసారు.