*హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు,జర్నలస్టు మిత్రులారా!
* TUWJ అవినీతి, అక్రమాలు చేసే వారిని సమర్థించదు.
“TUWJ పై గిట్టని వారు యూనియన్ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా, మాపై, మా అధ్యక్షుడు అల్లం నారాయణను ప్రస్థావిస్తూ వాట్సప్ గ్రూపులు, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
తెలంగాణ యూనియ్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీకి మేము ఒక వినతి పత్రం ఇచ్చాము. అందులో మేము ప్రస్తావించిన అంశాలు:
1. ప్రెస్ క్లబ్ లో కొత్తగా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారు మూడు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. వారికి ఎందుకు సభ్యత్వం ఇవ్వడం లేదు. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక సారి క్లబ్ నిబంధనల ప్రకారం కొత్త వారికి సభ్యత్వం ఇవ్వాలి. దానిని వెంటనే ఇవ్వండి అని కోరాము.
2. ప్రెస్ క్లబ్ బై లాస్ లో ఉన్న విధంగానే Out station members కు ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఓటు వేసే, పోటీ చేసే అర్హత ఉండదు. ప్రస్తుతం ఎవరైతే క్లబ్ లో సభ్యులుగా ఉండి, హైదరాబాద్ లో కాకుండా ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్నారో వారిని అవుట్ స్టేషన్ మెంబర్స్ గా గుర్తించి, వారి ఓటు వేసే హక్కును తొలగించాలని కోరాము.
3. ప్రస్తుతం హైదారబాద్ ప్రెస్ క్లబ్ లో మొత్తం సభ్యులు ఎంతమంది, Out station members ఎంతమంది అని గుర్తించి, ఈ వివరాలను ప్రతీ సభ్యుడికి అందజేయాలని కోరాము.
4. ప్రతీ సారి ప్రెస్ క్లబ్ కు ఎన్నికల సమయంలో ఎన్నికలు జరిగే రోజునే జనరల్ బాడీ సమవేశాన్ని ఏర్పాటు చేసి అందులో రెండు సంవత్సరాలకు సంబంధించిన ఎకౌంట్స్, ఇతర విషయాలను పొందుపర్చి హడావుడిగా జనరల్ బాడీ సమావేశాన్ని పూర్తి చేస్తున్నారు. దాని వల్ల సభ్యులు చెప్పిన సూచనలను సవరించి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఈ సారి ఎన్నికలు నిర్వహించే ముందు కనీసం ఒక నెల రోజుల ముందు జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో చర్చించి తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలి అని కోరారు. ఈ అంశాలలో TUWJ ప్రెస్ క్లబ్ లో జరిగిన, జరుగుతున్న అవినీతి, అక్రమాలకు మద్ధతు తెలిపినట్టుగా ఎక్కడ కనిపించిందో మాపై విమర్శలు చేసిన వారికే తెలియాలి. ప్రెస్ క్లబ్ లో అవినీతి, అక్రమాలు జరిగితే క్లబ్ లో ఉన్నసభ్యులు ఆ విషయాన్ని పరిశీలించి తప్పనిసరిగా ప్రశ్నిస్తారు. ప్రతీ సంవత్సరం క్లబ్ నిర్వహించే జనరల్ బాడీ సమావేశంలో ఈ అంశాలను ప్రస్థావించి అడుతారు. TUWJ ఎప్పుడూ అవినీతి, అక్రమాలు చేసే వారిని సమర్థించదు. ప్రెస్ క్లబ్ లో అక్రమాలు జరిగితే దానిపై విచారణ జరిపి, అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరో కొంత మంది అవినీతి చేశారని, వారికి మా యూనియన్ సపోర్టు చేసుందని TUWJ ప్రతిష్టను దిగజార్చే విధంగా మెసేజ్ లు, పోస్టింగ్ లు పెట్టడం సరైంది కాదు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ప్రెస్ క్లబ్ లో ఒక జర్నలిస్టు సంఘం అన్నీ తానై నడిపించింది. అప్పుడు ఎందుకు మీకు ఆ సంఘం కనిపించలేదు. ఇప్పుడు మేము జర్నలిస్టులు అందరికోసం మాట్లాడితే మాపై విమర్శలా. అవినీతి జరిగిందని అంటున్న వారు అవినీతి చేసిన వారు ఎవరో సాక్ష్యాధారాలతో సహా, వారి పేర్లతో సహా భయటపెట్టండి. ఎవరు వద్దన్నారు. అంతే కానీ నర్మగర్భ వ్యాఖ్యలు, పరోక్ష విమర్శలతో మీ పరువు తీసుకోకండి. ఒక జర్నలిస్టు యూనియన్ గా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి సభ్యత్వం ఇవ్వాలని అడగడం తప్పా…? అది వివాదాస్పద అంశం ఎలా అవుతుంది. సభ్యత్వాల కోసం మేము ఏదో సాగిలపడ్డామని రాశారు. మేము ఎవరి ముందూ సాగిలపడలేదు. పడం. ఆ మాట కొస్తే ఎవరెవరు… ఎక్కడెక్కడ సాగిల పడ్డారో వివరాలతో సహా చెప్పగలం. కానీ మాకు ఇప్పుడు ఆ అవసరం లేదు. మాపై ఇలాగే విమర్శలు చేస్తే ఎవరి వ్యవహారం ఏంటో అన్నీ స్పష్టం చేస్తాం. ఎవరో ఒకరిద్దు తప్పులు చేస్తే మేమూ, మా యూనియన్ వారి ట్రాప్ లో పడుతున్నామంటూ TUWJ పై విమర్శలు చేయడం హాస్యాస్పదం. టియుడబ్ల్యూజె ఎవరి ట్రాప్ లో పడదూ.మా యూనియన్ జర్నిలిస్టుల పక్షానే నిలబడుతుంది. మీకూ మీకూ ప్రెస్ క్లబ్ లో విభేదాలు ఉంటే వాటిని క్లబ్ నియమ, నిబంధనలకు లోబడి చూసుకోండి. అంతే కానీ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘంపై విమర్శలు చేయడం మానుకోవాలని తెలియజేస్తున్నాము.
>మారుతీ సాగర్, జనరల్ సెక్రెటరీ, TUWJ.
>ఇస్మాయిల్, TEMJU అధ్యక్షుడు.
>ఎ.రమణ కుమార్, TEMJU ప్రధాన కార్యదర్శి.
>పి.యోగానంద్, TUWJ హైదారబాద్ అధ్యక్షుడు.
>యార నవీన్ కుమార్, TUWJ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి.