Politicl భారత్లో మీడియాకు స్వేచ్ఛ లేదు.. చాలా ఏళ్ల నుంచి వినిపిస్తున్న మాట.. స్వామియే దేశమైన భారత్ లోనే కాదు అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా మీడియాకు స్వేచ్ఛ కనిపించడం లేదు.. తాజాగా ఓ మీడియా సంస్థపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం చర్చినీయంశంగా మారింది..
ఇప్పుడే కాదు స్వతంత్రం కాలం నాటి నుంచి వార్తాపత్రికలు నడపాలి అన్నా.. ఏ విషయాలు అయినా ప్రజలకు చేరవేయాలి అనుకున్నా బ్రిటిష్ వారి ఆంక్షలు గట్టిగానే ఉండేవి అయితే వీటన్నిటిని దాటుకొని రాజకీయ స్వాతంత్రోద్యమ నాయకులు ప్రజలని ఉత్తేజ పరిచేవారు.. తర్వాత ఎమర్జెన్సీ టైంలో కూడా మీడియా పై ఆంక్షలు విధించారు ఇందిరా ప్రభుత్వం నిజానికి ఆ కాలాన్ని భారతదేశానికి చీకటి రోజులని చెప్పవచ్చు ప్రజాస్వామ్య దేశం అయినా భారతదేశమే కాకుండా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఓ మీడియా సంస్థ తనకు పరువు నష్టం కలిగిస్తుంది అంటూ డోనాల్డ్ ట్రంప్ వేసిన పిటిషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..
అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్ నెట్వర్క్స్ పై డొనాల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా వేశారు… తనను ఒక పెద్ద మోసకారిగా సీఎన్ఎన్ చిత్రీకరిస్తోందని.. తన పరువుకు సీఎన్ఎన్ నెట్వర్క్ భంగం కలిగిస్తుందోనని ఆరోపించారు.. అంతే కాకుండా 475 మిలియన్ డాలర్లు(సుమారు 3వేల900 కోట్ల రూపాయలు) పరిహారం కోరారు. ఈ మేరకు 29 పేజీలతో కూడిన ఈ దావాను ట్రంప్ తరపు న్యాయవాదులు ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో సమర్పించారు. అయితే 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు 7వేల 700సార్లు తనను అబద్ధపు మోసకారిగా ఆ మీడియా సంస్థ అభివర్ణించిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని భయపడ