హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. “తుఫాన్” సినిమాను జూలైలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఈ రోజు “తుఫాన్” ట్రైలర్ రిలీజ్ చేశారు.
“తుఫాన్” ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఎవరి గతంలో లేని, మరొకరి భవితగా మారిన ఓ వ్యక్తి కథ ఇదని ట్రైలర్ లో చెప్పారు. తనకు ఎవరూ తెలియని ఓ ప్రాంతంలోకి వెళ్లి ఎవరూ తనను గుర్తుపట్టకుండా జాగ్రత్తపడుతుంటాడు హీరో విజయ్ ఆంటోనీ. అతన్ని తన చీఫ్ శరత్ కుమార్ గైడ్ చేస్తుంటాడు. హీరోను ఓ కుటుంబం ఆదరిస్తుంది. మరోవైపు పోలీస్ అధికారి మురళీ శర్మ…హీరో కోసం వేట సాగిస్తుంటాడు. ఇంతకీ ఎవరి గతంలోలేని హీరో గతమేంటి, అతని కోసం పోలీసు వేట ఎందుకు సాగుతోంది. కొత్త ప్రాంతంలో తనను ఆదరించిన కుటుంబం కోసం హీరో ఏం చేశాడు అనేది ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు.
సినిమాటోగ్రఫీ, బ్యూటిఫుల్ లొకేషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు, విజయ్ ఆంటోనీ ఇంటెన్స్, ఎమోషనల్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఇప్పటికే “తుఫాన్” సినిమా నుంచి రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కూడా ఇన్ స్టంట్ గా ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా ఆసక్తికరంగా ఉంది.
Actors : Vijay Antony, Sarath Kumar, Sathyaraj, Daali Dhanunjaya, Megha Akash, Murali Sharma, Prithvi Amber, Sharanya Ponvannan, Thalaivasal Vijay, etc.
Technical Team :
- Costumes: Shimona Stalin
- Designer: Tandora Chandru
- Action Choreographer: Supreme Sundar
- Art Director: Arumugaswamy
- Editing: Praveen KL
- Music: Achu Rajamani, Vijay Antony
- Dialogue Writer: Bhashya Shri
- PRO: GSK Media (Suresh – Sreenivas)
- Producers: Kamal Bora, D. Lalitha, B. Pradeep, Pankaj Bora
- Written, Cinematography, Direction: Vijay Milton