FILM NEWS : తెలుగు తెరపైకి మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతుంది. రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై, పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మాతలుగా, అనిల్ అర్కా – విహారికా చౌదరి హీరోహీరోయిన్లుగా, శ్రీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వారధి’. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సర్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసి చిత్ర యూనిట్ ను అభినందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ మాట్లాడుతూ… “ఈ కథ యూత్‌ను ఎట్రాక్ట్ లవ్, రొమాన్స్, థ్రిల్లర్ ఉండటంతో అందరిని ఆకట్టుకుంటుందని, ప్రేక్షకులందరికీ నచ్చే కథను అందించామనే నమ్మకం ఉందని తెలిపారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమా సాంకేతిక నిపుణుల కృషి, కథా కథనాల ప్రత్యేకత, నటీనటుల అభినయం చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘వారధి’లో ప్రేమ, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలను కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేశారు. ‘వారధి’ సినిమా ఈ తరానికి స్పెషల్ ట్రీట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
Presented by : Vibgyor Entertainment Pvt. Ltd.
Banner : Radha Krishna Arts
Title : Varadhi
Censor Rating : U/A 16+
Genre : Romance, Thriller, Drama
Cast : Hero: Anil Arka, Heroine: Viharika Choudhary, Antagonist: Prashanth Madugula, Supporting Role: Ridhi
Technical Crew : Story & Direction: Sri Krishna, Producers: Peyyala Bharathi, M.D. Younus, Writer: Nagendra Palagani, Cinematography: Shakti J.K.
Music Director: Shahrukh Sheikh, Executive Producer: B.N. Chandu, PROs: Kadali Rambabu, Dayyala Ashok