తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న స్థాపించి నేటికి 42 సంవత్సరాల గడిచిన సంధర్భంగా నేడు ఆవిర్భావ దినోత్సవం ఖమ్మం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కేతినేని హరిష్ చంద్ర ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది,
కేతినేని హరిష్ చంద్ర మాట్లడుతూ… తెలుగు రాష్ట్రాలలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 42 సంవత్సరాల క్రితం తెలుగుదేశంపార్టీనీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేవలం 9 నెలల్లో రాష్ట్ర నలుమూలల రథయాత్రలు చేసి ఎంతో శ్రమించి అధికారంలోకి తీసుక వచ్చిన ఘనత ఎన్టీఆర్ కి దక్కిందని అలాగే ప్రపంచ చరిత్రలో పార్టీని స్థాపించి అతి కొద్ది రోజుల్లో ప్రభుత్వాన్ని చేపట్టి రికార్డులు తిరగరాసి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు రెండు రూపాయల కిలో బియ్యం, జనత వస్త్రాలు, మహిళలకు ఆస్తిలో సమానహక్కు, పక్కా గృహ నిర్మాణ పథకం, పట్వారి పటేల్ వ్యవస్థ రద్దు, మాండలిక వ్యవస్థ, బడుగు బలహీనవర్గాలకు రాజకీయ రంగంలో మరియు మహిళలకు స్థానిక సంస్థలలో అవకాశం కల్పించి అస్తిలో సమాన హక్కు అలాగే రైతులకు 50 రూపాయలకు కరెంట్ పై స్లాబ్ పద్ధతి రాజకీయరంగంలో తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ అని,
అలాగే సినీ రంగంలో దేవుళ్ళ పాత్రలలో లీనమై చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ గారికి వెంటనే కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదు వెంటనే ప్రకటించాలని, గత రెండు నెలలుగా ఖమ్మం జిల్లా కార్యాలయంలో సంతకాల సేకరణ పోస్ట్ కార్డు ఉద్యమం విజయవంతం జరిగింది, వారికి భారతరత్న ఇస్తే ప్రపంచ తెలుగు ప్రజలు ఎంతో సంతోషిస్తారని ఆయన అన్నారు, అనంతరం కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పారుపల్లి సురేష్, ఆర్ఎం వరలక్ష్మి, (ఎం పి పి ఎన్కుర్) ప్యారిస్ వెంకన్న ,మండపల్లి రజిని, పోటు సరస్వతి, మంద వెంకటనారాయణ, కూచిపూడి జై, కన్నేటి పృధ్వీ, మందపల్లి కోటేశ్వరరావు చింతనిప్పు నాగేశ్వరరావు, నల్లమల రంజిత్, నల్లమల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.