టి సి ఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ని నవంబర్ లో నిర్వహిస్తున్నారు. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోస్టర్ లంచ్ కార్యక్రమంలో ఫౌండర్ సాయికృష్ణ, తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్టిస్ట్ భూపాల్ మరియు ఓంకార్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతూ : టి సి ఏ 2006లో స్థాపించారు. ఇలా సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ద్వారా క్రికెట్ మ్యాచ్ ఆర్గనైజ్ చేసి చారిటీ ద్వారా సహాయం అందిస్తున్న సాయి కృష్ణ గారికి మా అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా దేశాల్లో క్రికెట్ మ్యాచ్లు జరిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. ఒకే సంవత్సరంలో రెండు సీజన్లు నిర్వహించడం అనేది అంత ఈజీ కాదు. సీజన్ 1 పెద్ద సక్సెస్ అవ్వడం వల్ల నవంబర్లో సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఆయనకు సినిమా అనుభవం కూడా ఉంది. ఇంతమంది సెలబ్రిటీస్ ని తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ ఆడించడం అంత ఈజీ కాదు. అలాంటిది సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఈ నవంబర్ 15, 16 జరిగే ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.