మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు నిర్వహించనున్నారు. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా తమన్నా నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సైరా నరసింహారెడ్డి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. ఇక తమన్నా, చిరంజీవి కలిసి డ్యాన్స్ చేస్తే అభిమానులకు కన్నుల పండుగలా ఉంటుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం మీద తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. 2022లో భోళా శంకర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు : చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్
సాంకేతిక బృందం:
డైరెక్టర్ : మెహర్ రమేష్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
బ్యానర్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్
సంగీతం : మహతి స్వర సాగర్