FILM NEWS : స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్ & సెటిల్ కింగ్ ప్రొడక్షన్ నెం:1 లో వేణుబాబు నిర్మాతగా ఘంటసాల విశ్వనాథ్ దర్శకత్వంలో పవన్ చరణ్, జీవీ సంగీతాన్ని అందిస్తూ దిలీప్ కుమార్ చిన్నయ్య సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేస్తూ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆదర్శ్ పుందిర్, అశ్రీత్ రెడ్డి, ప్రియాంక సింగ్, పూజిత పుందిర్, రాజ్ గౌడ్, సునందిని, మధుసూదన్ తదితరులు కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ అండగా త్వరలోనే ఇతర సినిమా అప్డేట్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర నటి ప్రియాంక సింగ్ మాట్లాడుతూ… “నేను ఈ నిర్మాణ సంస్థలో పనిచేయడం మొదటిసారి. జీవి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సంగీత దర్శకుడైన జీవి గారు మొదటిసారి దర్శకత్వం చేస్తున్నారు. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు రావడం లేదు. కాబట్టి ఈ సినిమా ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది. అందుకుగాను ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ చిత్రంలో నటిస్తున్న తోటి నటీనటులతో, ఈ చిత్ర బృందంతో పనిచేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు.
నటి ఆదర్శ్ పందిరి మాట్లాడుతూ… “మేము కొత్త కామెడీతో ముఖ్యంగా లింగ బేధాల పై మంచి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాము. ఈ సినిమాలో టెక్నాలజీ అనేది కీలకపాత్ర పోషించబోతుంది. త్వరలోనే థియేటర్లో కలుసుకుందాం” అన్నారు.
నటుడు అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ… “మేమంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేస్తున్నాము. ఈ చిత్ర కథని నమ్మి సినిమా చేస్తున్నాము. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాము. త్వరలోనే ఈ సినిమా ద్వారా థియేటర్లలో కలుద్దాము” అన్నారు.
నటి పూజిత పుందిర్ మాట్లాడుతూ… “జెండర్ సమానత్వంపై కామెడీ రూపంలో వస్తున్న ఈ చిత్రం మంచి కామెడీతో ఉండబోతుంది. జీవి గారి దర్శకత్వంలో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు.
చిత్ర దర్శకుడు ఘంటసాల విశ్వనాథ్ మాట్లాడుతూ… “స్ప్లాష్ కలర్స్ మీడియా బ్యానర్ పై మేము తొలి సినిమా చేస్తున్నాము. అశ్రిత్, ఆదర్శ్, ప్రియాంక సింగ్ ముఖ్యపాత్రలు పోషిస్తూ వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 26న మొదలు పెట్టుకుని నిరంతరం పగలు రాత్రి తేడా లేకుండా 15 రోజులపాటు షూటింగ్ చేస్తూ నేటికి సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్నాము. మిగతా సగభాగం షూటింగ్ కోసం యుఎస్ వెళ్తున్నాము. టెక్నాలజీ, ఎమోషన్, లింగ సమానత్వం పై ఉండబోతున్న ఈ చిత్రం 2025లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరికీ నచ్చుతుందని, అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను” అన్నారు.
Cast : Aadarsh Pundhir , Asrith Reddy , Priyanka Singh , Pujita Pundhir , Raj Goud , Sunandini, Madhusudhan.
Director : Ghantasala Viswanath (GV)
Producer : VenuBabu A
Music Director: Pavan Charan & GV
DOP: Dileep Kumar Chinnaiah
Co- Producers: Srikant Vemparala , Vishwananth Machikalapati , Vikram Garlapati, Mahindra Aravapallu , Venkat Chilakala , Sai Kumar Medi, Swathi Y , Praveen Sankpal
Editor: Kottagiri Venkateswarao
Executive Manager: RamaKrishna
Lyrics: Kittu Vissapragada, Gowtham Chintu, Subhash, Narayan
PRO : Madhu VR
Digital Media: Digital Dukanam