కేంద్ర ప్రభుత్వ నూతన పథకం.. ఇప్పుడు బేచో ఇండియా – సేల్ ఇండియా : కేటీఆర్
• ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమే బిజెపి నయా ఎజెండా
• ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమూ దేశం కోసం – ధర్మం కొసమెనా అని ప్రశ్నించిన కేటీఆర్
• దేశంలో ఎక్కడ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మినా మనం స్పందించాలి
• వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మనం మౌనంగా ఉంటే ఇక్కడి సింగరేణి సైతం అమ్మదాంఅంటుంది కేంద్రం
• మా పార్టీ ఉద్యమ కాలం నుంచే పబ్లిక్ సెక్టార్ సంస్థలతో కలిసి పనిచేస్తుంది
• సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాట పట్టించిన పరిపాలన మాది
• ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు అంతా ఏకతాటిపైకి వచ్చి ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన సమయమిది
•ప్రభుత్వ రంగ సంస్థల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ. కే తారక రామారావు
హరిత ప్లాజా లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఉద్యోగులు
• ప్రభుత్వ ఉద్యోగుల మనసులో వారి భవిషత్తు పట్ల తీవ్రమైన ఆందోళన నెలకొని ఉంది
• భారతదేశం యొక్క ప్రయోజనాలు, భారతదేశ ప్రజల సంక్షేమం… ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తు పైన ఆధారపడి ఉన్నాయి
• కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వలు పెట్టుబడుల ఉపసంహరణ ను ఒక ఎజెండాగా పెట్టుకున్నాయి…
• కానీ, గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రస్తుతం కేంద్రలోని మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే ఎజెండాగా పెట్టుకున్నది
• మూడు లక్షల 30 వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా మోడీ ప్రభుత్వం సేకరించింది
• మోడీ ప్రభుత్వం మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా మాదిరే ఇప్పుడు బేచో ఇండియా… సేల్ ఇండియా అంటూ సంస్థలను తెగనమ్ముతున్నారు
• కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఎజెండాగా పెట్టుకున్న బిజెపి ప్రభుత్వం
• ఉన్న ఆస్తులనమ్మడమే… ప్రభుత్వ పరిపాలనగా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉంది
• కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలకు సహాయం ఇవ్వకుండా… వాటిని కావాలని సంపుతున్నారు
• విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారని… మనం మౌనంగా ఉంటే తెలంగాణలో ఉన్న సింగరేణిని కూడా ఖచ్చితంగా అమ్మేస్తరు
• స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూన్న వారందరికీ మనమంతా అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది
• కేంద్రానికి అవకాశం ఇస్తే ఇక్కడి సంస్థ లను కూడ అమ్ముతారు
• మా పార్టీ ఉద్యమ కాలం నుంచే పబ్లిక్ సెక్టార్ సంస్థలతో కలిసి పనిచేస్తుంది
• ఆయా సంస్థలకు జరిగిన అన్యాయాలను గతంలోనూ ఎండగట్టింది
• దేశంలో ఎక్కడ ప్రభుత్వ రంగ సంస్థలకు అన్యాయం జరిగిన ఇక్కడ ఉన్న ఉద్యోగులంతా సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉన్నది
• తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి లాభాల బాట పట్టించిన పరిపాలన మాది
• BHEL లాంటి సంస్ధల బలోతానికి 35 వేల కోట్ల ఆర్డర్స్ ఇచ్చాం…
• 1400 కోట్ల భీమా ప్రీమియం ఎల్ ఐ సి చెల్లిస్తున్న ప్రభుత్వం మాది
• ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా అందులో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేయడం ఖచ్చితంగా అమానవీయమైన చర్యనే
• గత ఆరు సంవత్సరాలుగా దేశం ఎరుగని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మా పాలనలో తెచ్చాం
• ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సిన సమయమిది
మా ఇద్దరు అభ్యర్థులకు ఇద్దరికి ఓట్ వేసి గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి