Viral pic: టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో చిత్రాలను బిజీ అయిపోతున్నారు. కాస్త కుటుంబంతో సమయం స్పెండ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది.కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీస్ తీసుకుని విదేశాల్లో లో కనువిందు చేస్తున్నారు మన టాలీవుడ్ కుర్రోళ్ళు.నిన్న మొన్నటి వరకు మహేష్ బాబు ఆ తర్వాత రామ్ చరణ్ తాజాగా నందమూరి బుల్లోడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్యతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న చేస్తున్న ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా అభిమానుల సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైనింగ్ గా మారింది.ఎన్టీఆర్ శ్రీమతి తో ఈ సారి ఇంగ్లాండ్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఒక పచ్చని ప్రదేశంలో భార్య ప్రణతకి ఎదురుగా ఎన్టీఆర్ కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్తున్నాడు. ఈ ఫొటోస్ కి నీటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.సామాజిక మాధ్యమాలలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్క పోస్ట్ చేస్తే చాలు మిలియన్స్ లో లైకులు రావడం సర్వసాధారణమే
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం “ఎన్టీఆర్ 31” పోస్టర్ విడుదలై సోషల్ మీడియా హల్ చల్ చేసిన విషయం కూడా తెలిసిందే.చూడాలి మరి ఈ నందమూరి బుల్లోడు ఏడాది ఏ సినిమాతో అభిమానులను అల్లరించనున్నాడు తెలియాలంటే ఏడాది వరకు ఆగాల్సిందే.