యంగ్ తరంగ్ తేజ సజ్జ హీరోగా ఆనంది, దక్ష నగార్కార్ హీరోయిన్స్ గా యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ లో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజ్ శేఖర్ వర్మ నిర్మించిన చిత్రం “జాంబిరెడ్డి”. ఫిబ్రవరి 5న 500 వందలకు పైగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొని కొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటులు నాగ మహేష్, గెటప్ శ్రీను, హేమంత్, కళా దర్శకుడు నాగేంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె. రాబిన్, కో-డైరెక్టర్ విజయ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమచ్చ, ప్రభ చింతలపాటి తదితరులు పాల్గొన్నారు.
హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. ‘ ఫస్ట్ టైం కొత్త సినిమా ట్రై చేశావ్.. చాలా బాగుందని 8వేలు ట్వీట్స్ వచ్చాయి. ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్, పెద్దలు అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమా నచ్చితే ఏ రేంజ్ లో ఉంటుందో తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 2.26 క్రోర్స్ కలెక్ట్ చేయడం.. ఒక డెబ్యూ హీరోకి ఈ నంబర్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ క్రెడిట్ అంతా ప్రశాంత్ కె చెందుతుంది. నా క్లోజ్ ఫ్రెండ్ ప్రశాంత్ వర్మ నాకు చాలా పెద్ద హిట్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. గెటప్ శ్రీను క్యారెక్టర్ కి థియేటర్ లో అరుపులు కేకలు వేస్తున్నారు ఆడియెన్స్.. ఇలాంటి కొత్త కాన్సెప్టుతో సినిమా తీయాలంటే దమ్ము, ధైర్యం కావాలి.. అది ఉన్న నిర్మాత రాజశేఖర్ గారు. అలాగే టెక్నీషియన్స్ కూడా ఎంతో సపోర్ట్ చేసి చాలా కష్టపడి చేశారు. వారందరికీ, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అన్నారు.