PUSHPA 2 : సంధ్య థియేటర్ దుర్ఘటన తరువాత హీరో అల్లు అర్జున్, నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు సుకుమార్‌తో పాటు పుష్ప-2 టీమ్ అంతా తీవ్ర మనస్తాపంలో వున్నారు. ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హస్పిటల్ ఖర్చులు హీరో అల్లు అర్జున్‌తో పాటు మైత్రీ మూవీస్ నిర్మాతలు బాధ్యతగా తీసుకున్నారు. దుర్ఘటన జరిగిన రోజు నుంచి హస్పటల్ ఖర్చులు తమ బాధ్యతగా స్వీకరించారు.
భవిష్యత్‌లో కూడా శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు వైధ్య ఖర్చులన్నీ అల్లు అర్జున్‌తో పాటు నిర్మాతలే భరించడానికి సిద్ధంగా వున్నారు. ఇటీవల శ్రీతేజ్ వైద్యంలో భాగంగా అవసరమైన ఓ ఇంజెక్షన్‌ను ఖర్చకు వెనుకాడకుండా సింగపూర్‌ను నుంచి తెప్పించారు. ఇటీవల హీరో అల్లు అర్జున్ తాను 25 లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు హస్పటల్ ఖర్చులు, భవిష్యత్‌లో ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని తెలియజేసిన సంగతి తెలిసిందే.
దుర్ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాస్, మైత్రీ నిర్మాలు, హీరో అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడూ శ్రీతేజ్ ఆరోగ్య అప్‌డేట్‌ను తెలుసుకుంటున్నారు. ఆ విషయాలను హీరో అల్లు అర్జున్‌కు తెలియజేస్తున్నారు. ఇటీవల నిర్మాత బన్నీవాస్ తరుచుగా హస్పటల్‌కు కూడా వెళుతూ శ్రీతేజ్ యోగాక్షేమాలు కనుక్కుంటున్నారు. శ్రీతేజ్ పూర్తి ఆర్యోగంగా కోలుకునేవరకు హీరో అల్లు అర్జున్ తరపున వారి అప్‌డేట్‌లను హీరో టీమ్ ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్నారు. త్వరలోనే శ్రీతేజ్ కోలుకోవాలని అందరం ఆశిద్దాం.