Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. భారీ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 10న విడుదలైన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై రామ్ చరణ్‌ను చూద్దామా! అని హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎదురు చూసిన అభిమానులకు సినిమా నెక్ట్స్ రేంజ్లో ఉండటంతో సినిమా తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుని బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. తొలిరోజున వరల్డ్ వైడ్‌గా ‘గేమ్ చేంజర్’ చిత్రం రూ.186 కోట్ల వసూళ్లను సాధించటం విశేషం.
రామ్ చరణ్ రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో ఒదిగిపోయి ఓ వైపు స్టైలిష్‌గా, మరో వైపు పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక డాన్సుల్లో ఆయన గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్, ఎస్.జె.సూర్య మధ్య ఉండే ఎగ్జయిటింగ్ సన్నివేశాలు, చరణ్, కియారా మధ్య కెమిస్ట్రీ, చరణ్, అంజలి, శ్రీకాంత్ మధ్య ఉండే ఎమోషనల్ సన్నివేశాలకు ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. అసలైన సంక్రాంతి పండుగ ముందడటంతో ఈ కలెక్షన్స్ రేంజ్ మరింత పెరుగుతుందనటంలో సందేహం లేదు. లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను తెరకెక్కించటంలో స్పెషలిస్ట్ అయిన శంకర్ తనదైన పంథాలో గేమ్ చేంజర్ సినిమాను వావ్ అనిపించే రీతిలో వండర్ మూవీగా ఆవిష్కరించారు.
ప్రతీ సీన్‌ను ఎక్స్ట్రార్డినరీగా సిల్వర్ స్క్రీన్‌పై తెరకెక్కించారు. అసలు సిసలైన సంక్రాంతి విన్నర్‌గా గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. గేమ్ చేంజర్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, తిరు ఎక్స్ట్రార్డినరీ విజువలైజేషన్ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు.