FILM NEWS : ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా నుంచి ‘డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
‘డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..’ లిరికల్ సాంగ్ ను శ్రీ వసంత్ మంచి బీట్ తో కంపోజ్ చేయగా, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ గా పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘ లక్ష్మీ వైన్సు, దుర్గ వైన్సు, సాయి బాబ వైన్సు, శ్రీనివాస వైన్సు, బాలాజీ వైన్సు, భార్గవి వైన్సు, శ్రీకృష్ణ వైన్సు, శివగణేశ వైన్సు, దేవుళ్లే చెబుతుంటే వెల్ కమ్సు, మీరెందుకు పెడతారు టోల్ గేట్సు, డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..స్వర్గానికి మనకు లింక్సు,’డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..మన బాడీకి పెట్రోల్ బంక్సు, ‘డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..కనిపెట్టినవాడికి థ్యాంక్సు…’ అంటూ సాగుతుందీ పాట.
Cast : Dharma, Aishwarya Sharma, Posani Krishna Murali, Srikanth Iyengar, Sameer, SS Kanchi, Bhadram, Kirrak Seetha, Ritu Chowdhury, Fun Bucket Rajesh, Raja Prajwal, and others.
Technical Team : Costume Designers: SM Rasool, Jogu Bindu Sri, Stills: Raju Vizag (SVA), VFX: Sumaram Reddy N, Art: Lavanya Vemulapalli, Choreography: Bhanu, Moin, DOP: Prashanth Ankireddy, Editing: Marthand K Venkatesh, Line Producer: Lakshmi Murari, Music: Sree Vasant, Lyrics: Chandrabose, PRO: GSK Media (Suresh – Sreenivas), Producers: Basavaraju Srinivas, Ismail Sheikh, Basavaraju Laharidhar, Written and Directed by Kiran Tirumalasetti