Dr M Mohan Babu & Actor Naresh Anounced Study Amount Through MAA Film Chamber For Actor TNR Childrens, TNR Wife Jyothi, Tollywood News, Latest Telugu News, Telugu World Now,
Tollywood News: నటుడు TNR గారి ఇద్దరు పిల్లల చదువుల పూర్తి భాద్యత “మా”దే: పద్మశ్రీ డా.మోహన్‌బాబు, డా.వి.కె.నరేష్.
TNR ఓ వైవు సినీ ప్రస్థానం, మరోవైపు జర్నలిజం ఫీల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన నటించింది చిన్న పాత్రలోనే అయినప్పటికీ మంచి గుర్తింపు అందుకున్నారు. నేనే రాజు నేనే మంత్రి, హిట్, జాతిరత్నాలు, జార్జిరెడ్డి వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన విషయం తెలిసిందే. కరోనాతో ఇటీవల దివంగతులైన ప్రముఖ జర్నలిస్ట్ మరియు నటుడు TNR గారి ఇద్దరు పిల్లల చదువుల పూర్తి బాధ్యతను తాము తీసుకుంటామని ప్రకటించిన పద్మశ్రీ డా.మోహన్‌బాబు, డా.వి.కె.నరేష్.
ఆపదలో ఉన్న తమ కుటుంబానికి అండగా నిలబడినందుకు డా.మోహన్‌బాబు, డా.వి.కె.నరేష్ గారికి MAA సభ్యులకు TNR భార్య జ్యోతి ధన్యవాదాలు తెలియచేసారు. ఇలా మా సభ్యులకు ఏ కష్టం వచ్చినా, తామే అండగా నిలుస్తుండటం ఇది అభినందనీయం అని ఈ సందర్బంగా డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్, మా మెంబర్, టిఎఫ్‌సిసి ఛైర్మన్ తెలియ చేసారు.