ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు దర్శకుడు తేజ. తన పుట్టినరోజు సందర్భంగా తేజ తన డ్రీమ్ ప్రాజెక్ట్ `విక్రమాదిత్య`ను ప్రకటించారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ప్రతిష్టాత్మకంగా ఈ ప్రేమకథను నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో పేరున్న నిర్మాత కావడంతో `విక్రమాదిత్యను` భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు.
రైలు ఆవిరిలోనుండి హీరో హీరొయిన్లు రొమాన్స్ చేస్తున్నట్లు చూపించారు. ఈ తరహా క్లాసిక్ ప్రేమకథలను తెరపై తొలిసారిగా చూడబోతున్నాం. ఈ కథ 1836 సంవత్సరంలోనిది అని పోస్టర్ ద్వారా తెలిపారు. ఇదే సమయంలో సర్ ఆర్థర్ కాటన్ ధవలేశ్వరం బ్యారేజీని నిర్మించాడు. ఈ కథ ఆ కాలం నాటిదని ఆ వంతెనకు ఈ ప్రేమ కథకు మధ్య సంబంధం ఉందని తెలుస్తోంది.విక్రమాదిత్య షూటింగ్ 22:2:22 మధ్యాహ్నం 2:22 గంటలకు శుభ ముహూర్తంలో ప్రారంభమైంది, ఆసక్తికరంగా తేజ యొక్క బ్లాక్ బస్టర్ జయం మూవీ షూటింగ్ కూడా సరిగ్గా 20 సంవత్సరాల క్రితం అదే సమయంలో ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్లు పని చేస్తున్నారు.
సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకుడు: తేజ, నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), బ్యానర్: లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్, సమర్ఫణ: భవ్య, PRO: వంశీ-శేఖర్.