Devotional : శబరిమల లో కొలువైన దేవుడు అయ్యప్ప స్వామి. ఇది కేరళ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక పుణ్యక్షేత్రాల్లో శబరిమలై ఒకటిగా చెప్పవచ్చు. అయ్యప్పను సందర్శించడానికి ప్రతిఏటా 10 నుండి 15 మిలియన్ల భక్తులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక విషయంలోనికి వెళ్తే శబరిమల ఆలయ ద్వారాలు 16 అనగా (బుధవారము) తెలుసుకోబోతున్నాయి అని ఆలయ అధికారులు తెలియజేశారు. గురువారం అనగా 17వ తేదీ నుండి రెండు నెలల పాటు స్వామి దర్శనం ఇవ్వబోతున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకులు, మాజీ ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ గర్భగుడి తలుపులు తెరవబోతున్నారు.
అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. 41 రోజులపాటు జరగబోయే మండల పూజా కార్యక్రమాలు డిసెంబర్ 27న ముగియనున్నారు. తరువాత భక్తులకు మూడు రోజులపాటు దర్శనానికి ఏర్పాట్లు చేయనున్నారు. తిరిగి డిసెంబర్ 30వ తేదీన మకరవిలుక్కు యాత్ర కోసం తెరవనున్నారు. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి సందర్శనం భక్తులకు ఉంటుంది.
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ద్వారాలు మూసివేస్తారు. శబరిమలై మార్గంలో కట్టుదిట్టమైన బందోబస్తు కోసం సుమారు 13 వేల మంది పోలీసులని నియమించబోతున్నారు. అలాగే రోజుకి 1.2 లక్షల మంది భక్తులు స్వామిని సందర్శించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అని కేరళ ప్రభుత్వం వెల్లడి చేసింది.