CM KCR, American Telugu Association, ATA, Covid19, Oxygen Concentrators, Actor Lohith kumar, Minister V Srinivas Goud, Covid News,
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపు మేరకు కోవిడ్ -19 విపత్తు సహాయం కోసం అమెరికా తెలుగు సంఘం 2 అత్యాధునిక ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిణి ని మహబూబ్ నగర్ లోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపిణీ చేశారు.
ఈ సంక్షోభంలో మన మాతృభూమికి సహాయం అందించేందుకు ఆటా సంఘం ముందుకు వచ్చినందుకు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు ఆటా ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తొలి విడుతగా 2 అత్యాధునిక ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిణి ని చేశామన్నారు. త్వరలోనే మరో 20 అత్యాధునిక ఆక్సిజన్ కాన్సంట్రేటర్లును ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అందిస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సహకారంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు, ఇంజెక్షన్ లతో పాటు అన్ని సౌకర్యాలను సమకూర్చుతున్నామన్నారు.
జిల్లాలో ఉన్న అన్ని ప్రవేట్ ఆసుపత్రిలలో సిటీ స్కాన్ ల ధరలను పూర్తి స్థాయిలో నియంత్రణ కు చర్యలను చేపట్టామన్నారు. గతంలో సిటీ స్కాన్ రూ. 5500 నుండి రూ. 1999 వరకు తగ్గించి పేదలకు వైద్య ఖర్చులు పెరగకుండా సాధారణ ధరలకు కోవిడ్ వైద్యంను అందిస్తున్నామన్నారు. అత్యాధునిక ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ను అందించిన ATA అధ్యక్షులు భువనేష్ బుజ్జాల, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఆటా కోవిడ్ హెల్ప్ సర్వీస్ ఛైర్ గా అనిల్ బోద్దిరెడ్డి లను మంత్రి టెలిఫోన్ లో అభినందించారు. సెకండ్ వేవ్‌లో కరోనా పేషెంట్లు ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వైరస్ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిన వాళ్లలో వ్యాధి తీవ్రతను బట్టి ఆక్సిజన్ వినియోగం మారుతూ ఉంటుంది. దింతో ఆక్సిజన్ కోరతను దృష్టిలో ఉంచుకుని అమెరికా తెలుగు సంఘం ATA ఆక్సిజన్ కోరత తీర్చేందుకు సుమారు 600 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వివిధ దశలలో ఇండియాకు తెప్పించి ఇస్తున్నందుకు మహబూబ్ నగర్ జిల్లా తరుపున కృతజ్ఞతలు తెలిపారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
ఈ కార్యక్రమంలో అమెరికా తెలుగు సంఘ కోఆర్డినేటర్లు కరకాల కృష్ణ రెడ్డి, లోహిత్ కుమార్, ప్రతినిధులు శ్రీనివాస్ బండారు, వెంకటేశ్వరరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.