Avatar 2 : హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్-2 గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్ అంతా ఈ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 2009 లో రిలీజ్ అయిన అవతార్ కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్ తో కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా… పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
అవతార్-2 మూవీని ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు ఇండియాలోనూ అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ సినిమా రిలీజ్ రోజునే కళ్లు చెదిరే వసూళ్లు రాబట్టినట్లుగా చిత్ర వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఈ సినిమా ఇండియాలో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అవతార్ 2 మూవీ ఇప్పటివరకు ఏకంగా రూ.368.20 కోట్ల వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రికార్డును సృష్టించింది.
గతంలో హాలీవుడ్ సూపర్ హీరో మూవీ అవెంజర్స్ ఎండ్‌గేమ్ రూ.367 కోట్ల వసూళ్లతో టాప్ స్థానంలో నిలవగా, ఇప్పుడు దాన్ని అవతార్-2 క్రాస్ చేసింది. జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ టోటల్ రన్లో ఎంతమేర కలెక్షన్లు రాబడుతుందా అని ఇండియన్ మూవీ లవర్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా అవతార్-2 తన రికార్డుల వేటను ఇంకా కొనసాగిస్తుండటం విశేషమని చెప్పాలి. ఈ సినిమాపై బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రూ.16,400 కోట్లు ఆదాయం రావాలని జేమ్స్ కామెరూన్ ప్రకటించారు. ఈ సినిమా విడుదలైన 12 రోజుల్లోనే రికార్డు స్థాయిలో బిలియన్ డాలర్లను (రూ.8,200 కోట్లు) వసూలు చేసింది. బిలియన్ డాలర్లలో 300 మిలియన్ డాలర్లు ఒక్క నార్త్ అమెరికాలో వసూలు కాగా, మిగిలిన 700 మిలియన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా వసూలైంది. ఇక ఆ బ్రేక్ ఈవెన్ ని ఈజీగా దాటేస్తుందని అనుకుంటున్నారు.
#Avatar2 creates HISTORY… Emerges the HIGHEST GROSSING #Hollywood film in #India by surpassing *lifetime biz* of #AvengersEndgame.
⭐️ #Avatar2: ₹ 368.20 cr NBOC
⭐️ #AvengersEndgame: ₹ 367 cr NBOC#India biz. #Avatar #AvatarTheWayOfWater pic.twitter.com/eS8EIZ5xu4— taran adarsh (@taran_adarsh) January 21, 2023