Political News: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడడంతో పార్టీ అధినేతలు జిల్లాలో పర్యటించడం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొన్ని జిల్లాలను సందర్శించారు. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా అయినా కడప లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన కొరకు కడప జిల్లాలో సీనియర్ నాయకులు కార్యకర్తలు జగన్ రాక కొరకు తగు జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
అయితే వచ్చేనెల ( సెప్టెంబర్) 1, 2 తేదీలలో కడప జిల్లాను సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, గెస్ట్ హౌస్, నెమళ్ల పార్కు తదితర ప్రాంతాలను ఆయన జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, పులివెందుల ఆర్డీఓ వెంకటేశులు, తదితరులు పాల్గొనడం జరిగినది.
సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని.అలానే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సీఎం పర్యటనను విజయవంతం చేస్తామని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి పర్యటించే షెడ్యూల్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని మీడియా మిత్రులకు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు, రెవెన్యూ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి జిల్లా అవ్వడంతో పర్యటనకు మరింత హంగులు హంగులతో ఏర్పాటు ఏర్పాటు చేయడం విశేషంగానే ఉందండోయ్.