విశాఖపట్నం నుంచి జగ్గయ్యపేటకు వస్తున్న లారీలో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన శుక్రవారం నవాబుపేట వద్ద జరిగింది. విశాఖపట్నం నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమకు లారీలో బొగ్గు రవాణా చేస్తున్నారు. అనకాపల్లికి చెందిన లారీ డ్రైవర్ కనగాల అప్పారావు తన మిత్రులైన అనకాపల్లికి చెందిన గంధం సత్యనారాయణ (57), నర్సింగ్‌రావు (47)లతో కలిసి బయలుదేరారు.
శుక్రవారం మధ్యాహ్నం తోటచర్ల సమీపంలోకి రాగానే లారీ టైర్లలో గాలి తగ్గడంతోపంక్చర్ షాప్ వద్ద గాలి పట్టించారు. అనంతరం బయలుదేరి నవాబుపేట అడ్డరోడ్డు వద్దకు రాగానే లారీ క్యాబిన్‌లోనే సత్యనారాయణ, సర్సింగ్రావులు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వెంటనే లారీని పక్కకు ఆపిన డ్రైవర్ 108కి సమాచారం అందించాడు. కొద్దిసేపటికే వారు మృతి చెందడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చిల్లకల్లు ఎస్ఐ సతీష్, పెనుగంచిప్రోలు ఏఎస్ఐ శంకర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను జగ్గయ్యపేట ఆసుపత్రిలో మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎండ తీవ్రతకు వడదెబ్బ ప్రభావంతో మృతి చెందారా?, ఏదైనా హానికర పదార్థాలు తాగారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
NTR జిల్లా జగ్గయ్యపేట : పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట క్రాస్ రోడ్డు వద్ద లారీలు ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద మృతి. వైజాగ్ నుండి జగ్గయ్యపేటకు టలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కి బొగ్గుతో వస్తున్న లారీ. లారీ లో డ్రైవర్ కి స్నేహితులుగా లారీలు ప్రయాణం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు. వైజాగ్ నుంచి నిన్న రాత్రి బయలుదేరిన లారీ వచ్చే క్రమంలో మద్యం సేవిస్తూ ప్రయాణం చేసిన ముగ్గురు వ్యక్తులు. మధ్యాహ్నం అనుమానస్పద స్థితిలో లారీ క్యాబిన్ లో మృతి చెంది ఉన్న ఇద్దరు వ్యక్తులు. పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన లారీ డ్రైవర్. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు లో ఒకరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మరొకరు బ్యాంకు ఉద్యోగి గా గుర్తింపు. ఘటన చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెనుగంచిప్రోలు పోలీసులు.